భగవంతుడు.. భక్తుల చెంతకు వెళ్లే దివ్యక్షేత్రం శ్రీకాళహస్తి. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో శివయ్య పెళ్లికి వచ్చిన బంధుగణాన్ని, సమస్త భక్తగణానికి వీడ్కోలు పలికేందుకు నిర్వహించిన కైలాసగిరి ప్రదక్షిణోత్సవం ఆద్యంతం వైభవంగా సాగింది. 21 కిలోమీటర్ల పొడవునా వ్యాపించి ఉన్న కైలాసగిరి పర్వతశ్రేణుల చుట్టూ.. భక్తవత్సలుడైన భగవంతునితో పాటు వేలాది మంది భక్తులు నడుచుకుంటూ వెళ్లారు. విల్లంభులు ధరించిన పరమేష్ఠి ఆగమనంతో.. పల్లె ప్రాంతాలన్నీ పులకించిపోయాయి. నవ దంపతులకు అడుగడుగునా భక్తకోటి నీరాజనాలు పలుకుతూ ఆనందంతో ఉప్పొంగిపోయారు. గిరిప్రదక్షిణ వెళ్లలేని భక్తులు ఎదురుగా శుకబ్రహ్మాశ్రమం వద్దకు వెళ్లి ఉత్సవమూర్తులకు స్వాగతం పలికారు.

ఆలయ వేద పండితులు అర్థగిరి స్వామి మాట్లాడుతూ… ఈ గిరిప్రదక్షణలో స్వామి అమ్మవాళ్ళతో పాటు వేలాదిమంది భక్తులు తండోపతండాలుగా స్వామి అమ్మవార్ల వెంట
భక్తిపారారసంతో నడిచి వెళ్లే ఘట్టం అత్యంత అద్భుతంగా ఉంటుందని , ఈ గిరి ప్రదర్శనలో పాల్గొన్న భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుంటే సకల శుభాలు చేకూర్తాయని తెలియజేశారు
బైట్.. అర్ధగిరి స్వామి ఆలయ వేద పండితులు
Also read
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- ముఖ్యమంత్రి చంద్రబాబు జలవిజన్ కు ఎన్నో ప్రశంసలు
- చాక్లెట్ ఆశచూపి బాలుడి కిడ్నాప్
- రేపే వివాహం.. ఇంతలోనే కాల్వలో గల్లంతు
- అమానుషం.. అర్ధరాత్రి కదులుతున్న ఆటో నుంచి రోడ్డుపై ఏదో విసిరేశారు! దగ్గరకెళ్లి చూడగా..





