నంద్యాల : జల్సాలకు అలవాటు పడి నంద్యాల జిల్లాలో దొంగతనాలకు పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి 42 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పి సునీల్ షెరాన్ తెలిపారు. ఎస్పి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన పలు విషయాలను వెల్లడించారు. బెంగళూరుకు చెందిన సోహెల్‌ఖాన్ అలియాస్ జహీర్‌ఖాన్ జల్సాలకు అలవాటు పడి 2025లో ఆత్మకూర్ పోలీస్ స్టేషన్, నంద్యాల పట్టణం 1 టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలకు పాల్పడి సుమారు రూ.42 లక్షలు విలువైన 42 తులాల బంగారు ఆభరణాలను చోరీ చేశాడు. వచ్చిన సొమ్మును వెలుగోడు దగ్గర ఎస్ఆర్బిసి కెనాల్ వద్ద దాచిపెట్టాడు. నిందితుడిపై గతంలో కుప్పం, పెనుగొండ, కర్ణాటక రాష్ట్రాల్లోని పలు పోలీస్ స్టేషన్ పరిధిలో కేసులున్నాయని, ఈ కేసులలో జైలుకు కూడా పోయి వచ్చాడని ఎస్పి చెప్పారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో గాలింపు చర్యలు చేపట్టి నిందితుడిని అరెస్టు చేశామని ఆయన తెలిపారు
Also read
- జాతక దోషం ముగించాలంటే.. శివ దీపం వెలిగించండి! సోమవారం శక్తి రహస్యాలు
- కేతువు సంచారం ప్రభావం: ఈ రాశుల వారికి ఆర్థిక లాభాలు, శుభయోగాలు.. మీ రాశి ఇదేనా?
- కోటి ఆశలతో పెళ్లికి సిద్ధమయ్యాడు.. ఎంగేజ్మెంట్ జరిగిన కొన్ని రోజులకే..
- Telangana: ఫుల్‌గా తాగాడు.. బైక్ వద్దకు వెళ్లాడు.. కట్‌చేస్తే.. అతను చేసిన పనికి..
- చెట్టుపై కనిపించిన అనుమానాస్పద కవర్.. ఏముందా అని ఓపెన్ చేయగా..





