SGSTV NEWS
Andhra PradeshCrime

Gang War: శ్రీకాళహస్తిలో అర్ధరాత్రి గ్యాంగ్ వార్ కలకలం


శ్రీకాళహస్తిలో అర్ధరాత్రి గ్యాంగ్ వార్ కలకలం రేపింది. కత్తులు, ఇనుప రాడ్లు, కర్రలు, రాళ్లు చేతపట్టుకుని యువకుల రెండు వర్గాలు వీధుల్లో పరస్పరం దాడులు చేసుకోవడంతో ఒక గంట పాటు అలజడి నెలకొంది. ఈ ఘర్షణలో మొత్తం ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి


Gang War: అర్ధరాత్రి సమయంలో ప్రశాంతంగా ఉండే శ్రీకాళహస్తి పట్టణం ఒక్కసారిగా రణరంగాన్ని తలపించింది. కత్తులు, ఇనుప రాడ్లు, కర్రలు, రాళ్లు చేతపట్టుకుని యువకుల రెండు వర్గాలు వీధుల్లో పరస్పరం దాడులు చేసుకోవడంతో ఒక గంట పాటు అలజడి నెలకొంది. ఈ ఘర్షణలో మొత్తం ఐదుగురికి తీవ్ర గాయాలు కావడం గమనార్హం. వివాదానికి కారణం చాలా చిన్నదే. మద్యం సేవించిన యువకులు మంచినీళ్ల కోసం ఆస్పత్రి దగ్గర తలపడ్డారు. దట రోహిత్, ధనుష్ అనే ఇద్దరు యువకులు నీళ్ల కోసం ఆసుపత్రి సమీపానికి వెళ్లగా అక్కడ మద్యం మత్తులో ఉన్న భాను, చరణ్, కిరణ్ అనే ముగ్గురు వారితో వాగ్వాదానికి దిగారు

తాగిన మైకంలో గ్యాంగ్ వార్..
ఈ మాటల యుద్ధం కొద్దీ కాలంలోనే దాడిగా మారింది. ముగ్గురు కలిసి రోహిత్, ధనుష్‌పై కర్రలతో దాడి చేయడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన రోహిత్, ధనుష్‌ను వారి స్నేహితులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడే మరోసారి ఘర్షణ చోటుచేసుకుంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోహిత్‌, ధనుష్‌పై మరోసారి భాను, చరణ్, కిరణ్ కలిసి దాడి చేయడంతో పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. ఆసుపత్రి ప్రాంగణంలో రెండు వర్గాల మధ్య మళ్లీ కత్తులు, ఇనుపరాడ్లు, రాళ్లతో ఘర్షణ జరిగింది.

ఈసారి రోహిత్, ధనుష్‌ స్నేహితులు కూడా స్పందించి ఎదురు దాడికి దిగడంతో ఘర్షణ మరింత ఉధృతమైంది. ఈ గ్యాంగ్ వార్ తీవ్రతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇతర రోగులు, నర్సులు భయంతో పరుగులు పెట్టారు. గంటపాటు ఆసుపత్రి ప్రాంగణం యుద్ధభూమిగా మారింది. ఘటనలో మొత్తం నలుగురికి తీవ్ర గాయాలు కాగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

Also read


Related posts

Share this