బతుకమ్మ ఆడుతూ ఓ మహిళ గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే కన్నుమూసింది. విషాదకరమైన ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఎంచగూడెం గ్రామంలో చోటుచేసుకుంది
బతుకమ్మ ఆడుతూ ఓ మహిళ గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే కన్నుమూసింది. విషాదకరమైన ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఎంచగూడెం గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. వివాహిత శెట్టి మౌనిక(32) ఉదయం నుండి ఇద్దరు కూతుర్లు, కొడుకుతో కలిసి ఎంతో ఆనందంతో తీరొక పూలను తెంపుకొచ్చి ఆ పూలతో బతుకమ్మను పేర్చింది. సాయంకాలం సమయంలో స్థానిక దేవాలయంలో కుటుంబ సభ్యులతో ఎంగిలిపూల బతుకమ్మ సంబరాల్లో పాల్గొని పాటలు పాడుతూ కోలాటాలు వేస్తూ, బతుకమ్మల చుట్టూ తిరుగుతూ ఒక్కసారిగా గుండెపోటుతో కుప్ప కూలిపోయింది. దీంతో పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందింది. దీంతో పండగ పూట ఆ కుటుంబంలో విషాదఛాయలు
అలుముకున్నాయి. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.
Also read
- Hyderabad: అతన్ని గుడ్డిగా నమ్మింది.. హోటల్‌కు వెళ్లింది.. కట్‌చేస్తే.. అసలు మ్యాటర్ తెలిసి..
- అగస్త్య మహర్షి ప్రతిష్ఠించిన శివలింగం- ప్రొద్దుటూరులో అరుదైన నవగ్రహ మండపం విశేషాలివే!
- తల్లి మృతిని తట్టుకోలేక.. భార్యను చంపి భర్త ఆత్మహత్య
- లాయర్ అయితే నాకేంటి.. చంపకుండా ఇక్కడి నుంచి వెళ్లను!’
- రోడ్డు ప్రమాదంలో ట్రాఫిక్ డీసీపీ కుమార్తె మృతి




