వరంగల్లో ఓ యువతిపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆమె స్నేహితుడే బలవంతంగా తీసుకెళ్లి.. తన మిత్రులతో కలిసి అత్యాచారానికి పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం.
మట్టెవాడ, : వరంగల్లో ఓ యువతిపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆమె స్నేహితుడే బలవంతంగా తీసుకెళ్లి.. తన మిత్రులతో కలిసి అత్యాచారానికి పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం. స్థానిక ఇంతేజార్గంజ్ ఠాణా సీఐ శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. భూపాలపల్లి ప్రాంతానికి చెందిన ఓ యువతి నగర శివారులోని ఓ ప్రైవేటు కళాశాలలో ఫార్మసీ రెండో సంవత్సరం చదువుతోంది. కళాశాల సమీపంలో వసతిగృహంలో ఉంటోంది. గత నెల 15న ఆమె స్వస్థలానికి చెందిన తెలిసిన యువకుడొకరు వసతిగృహం వద్దకు వెళ్లాడు. మాట్లాడే పని ఉందంటూ ఆమెను కారులో ఎక్కమన్నాడు. అప్పటికే అందులో మరో ఇద్దరు యువకులు ఉండటంతో యువతి నిరాకరించినా.. బలవంతంగా కారులో నగరానికి తీసుకొచ్చారు. వరంగల్ కూరగాయల మార్కెట్ సమీపంలోని ఒక లాడ్జి మొదటి అంతస్తులో గది తీసుకున్నారు.
అక్కడ యువతికి మద్యం తాగించి ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. కాలేజీలో పరీక్షలుండటంతో ఫిర్యాదు చేయలేదని, సెలవులకు ఇంటికి వెళ్లిన తర్వాత అత్యాచారం విషయాన్ని యువతి తల్లికి చెప్పిందని సమాచారం. తర్వాత తల్లి, కుమార్తె వరంగల్ పోలీసు కమిషనర్ను కలిసి విషయం చెప్పారు. ఆయన సూచన మేరకు మంగళవారం ఇంతేజార్గాంజ్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు లాడ్జిలోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. లాడ్జి నిర్వాహకుల వద్ద స్వాధీనం చేసుకున్న ఆధార్ కార్డులను బట్టి ఒక యువకుడిది భూపాలపల్లి అని గుర్తించారు. బాధితురాలి మిత్రుడితో పాటు.. మరో యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. మూడో వ్యక్తి కోసంగాలిస్తున్నారు. యువతిని భరోసా కేంద్రానికి తరలించారు.
Also read
- AP Crime: ఏపీలో మరో పరువు హత్య.. మైనర్ బాలికను చంపేసిన పేరెంట్స్!?
- సర్కార్ గట్టుకు మరమ్మతులు చేపట్టిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ళ రాము
- గురు, రాహువులతో ఆ రాశులకు ఐశ్వర్య యోగాలు..!
- Vastu Tips: ఈ పక్షులు ఇంటికొస్తే మీ దశ తిరిగినట్టే.. ఈ మూగజీవాలు ఇచ్చే సంకేతాలివే..
- నేటి జాతకములు.11 ఏప్రిల్, 2025