SGSTV NEWS
Andhra Pradesh

తిరుపతిలో రాష్ట్ర ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ కు ఎఫ్ ఆర్ టీ ఐ అవగాహన సదస్సు 

విద్యుత్ ఉద్యోగుల పర్మినెంట్ కు నాయకుల భరోసా



తిరుపతి

తిరుపతి లోని యూత్ హాస్టల్ లో నిర్వహించిన,రాష్ట్రంలోని వివిధ జిల్లాల కాంట్రాక్ట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ సదస్సులో ఎఫ్ ఆర్ టి ఐ సంస్థ నేషనల్ ప్రెసిడెంట్ ప్రత్తిపాటి.చంద్ర మోహన్  సూచనల మేరకు,ఫోరం ఫర్ ఆర్టీఐ సంస్థ నేషనల్ జాయింట్ సెక్రటరీ కుప్పాల.అజయ్ ప్రసన్న కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి, ఫోరం ఫర్ ఆర్టీఐ ఆంధ్రా స్టేట్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ గా మండ్యo.సుధాకర్ యాదవ్ నియామకాన్ని సభికుల అందరి మధ్య ప్రకటించటం జరిగింది. ఈ సమావేశంలో వివిధ జిల్లాల కాంట్రాక్ట్ బేస్డ్ ఎంప్లాయీస్ ఎలక్ట్రిసిటీ యూనియన్ నాయకులు మరియు నూతన ఎంప్లాయీస్ రాష్ట్ర అధ్యక్షులు సుధాకర్ మాట్లాడుతూ ఎన్ని గవర్నమెంట్ లు మారుతున్న గత మూడు దశాబ్దాలుగా,రెగ్యులర్ ఎంప్లాయీస్ మాదిరిగా సమాన పనికి సమాన వేతనాలు వారికి ఇవ్వటం లేదని,  కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కు కూడా తగు రీతిన జీత బత్యాలలో న్యాయం జరిపించుకోటం కోసం ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ పలు అధికారులు, వారి కార్యాలయాల చుట్టూ తిరిగి , తిరిగి వందల సంఖ్యలో అర్జీలు, వివిధ ప్రాంతాలలో సమ్మె లు , నిరాహార దీక్షలు చేసినా కూడా, తగిన జీతా భత్యాలు పొందలేక అలసిపోయామని, ఆవేదన వెలిబుచ్చారు.

ప్రజల అందరి ఇళ్లలో,కరెంట్తో మేము వెలుగులు నింపుతూ ఉంటే, విద్యుత్ కాంట్రాక్ట్ జాబ్ లు చేస్తున్న ఉద్యోగాలుకు మాత్రం  జీత భత్యాలు సరిగా ఇవ్వక,ప్రతి నిత్యం వారి బిడ్డలకు,కుటుంబ సభ్యులకు ప్రాణ భయం,ఆదమరిస్తే కరెంట్ షాక్ ల వల్ల వారి ప్రాణాలకు సంకటంగా మారుతూఉంటే, ఇకనైనా కాంట్రాక్ట్ విద్యుత్ ఎంప్లాయీస్ ను గుర్తిస్తారనే ఆశతో,చాలీ చాలని జీతాలతో ఈ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు చేస్తున్నామని,వారి బాధను, ఫోరం ఫర్ ఆర్టీఐ సంస్థ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాలని కోరుకున్నారు.ఈ గవర్నమెంట్ ఐనా వారి హక్కులను పరిరక్షించాలని కోరారు. ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ సదస్సులో కేంద్ర కమిటీ అజయ్ ప్రసన్న కుమార్ నేతృత్వంలో,ఎఫ్ ఆర్ టి ఐ ,రాష్ట్ర, జిల్లా నేతలు,వక్తలు ఆర్ టి ఐ యాక్ట్, లోకాయుక్త ,హ్యూమన్ రైట్స్ మీద అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించి, అందరికీ విశదం గా తెలియ చేశారు అలాగే వారి వారి జిల్లా,మండల కేంద్రాల్లోని ఎంప్లాయీస్ కు,సామాన్య ప్రజలకు కూడా ఈ చట్టాల మీద అవగాహన కల్పించమని, ఎడ్యుకేట్ చేయమని అన్ని జిల్లాలో కూడా ఆక్టివ్ ఎంప్లాయీస్ ,ఎఫ్ ఆర్ టి ఐ మెంబర్షిప్ లు చేయాలని తెలిపారు.అలాగే ఎఫ్ ఆర్ టీ ఐ సంస్థ నాయకత్వాలు ఆంధ్రా రాష్ట్ర పెద్దల ల దృష్టికి మీ సమస్యలను డైరెక్ట్ గా, మరియు రాత పూర్వకం గా కూడా తీసుకెళ్లి,ఈ గవర్నమెంట్లో,ఐనా  ఎంప్లాయీస్ అందరికీ తగు న్యాయం జరిగేలా అందరూ  ప్రయత్నిస్తాము అన్నారు.ఈ సదస్సులో ఎఫ్ ఆర్ టి ఐ నూతన ఎంప్లాయీస్ అధ్యక్షులు సుధాకర్ ను, ఫోరం ఫర్ ఆర్ టి ఐ నాయకత్వాలు,అన్ని జిల్లాల విద్యుత్ యూనియన్ నాయకులు ఘనంగా సన్మానించి అభినందనలు తెలియ చేశారు.ఈ సదస్సులో ఎఫ్ ఆర్ టి ఐ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్.రేవతి, జిల్లా అధికార ప్రతినిధి కరాటే చంద్ర శేఖర్ రాయల్, తిరుపతి జిల్లా ఎంప్లాయ్ అధ్యక్షులు గుణ శేఖర్, చంద్రగిరి నియోజక వర్గ ఎంప్లాయీస్ సెక్రటరీ వెంకట రత్నం,జిల్లా ప్రెసిడెంట్ ప్రశాంత్, జిల్లా మహిళా ప్రెసిడెంట్ సూర్య కుమారి,ఎంప్లాయ్ వైస్ ప్రెసిడెంట్ కిరణ్, ఎంప్లాయీస్ సెక్రెటరీలు రాజు, లోక నాదం, టౌన్ లీగల్ వింగ్ కన్వీనర్ మహా లక్ష్మీ,టౌన్ మహిళా ప్రెసిడెంట్ సుజాత, టౌన్ సెక్రటరీ రాణి, వివిధ జిల్లాల విద్యుత్ యూనియన్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Also read l

Related posts