• ఎముకల సేకరణ
• మృతుడి బంధువు ఫిర్యాదు మేరకే అన్న అధికారులు
ఇల్లంతకుంట(మానకొండూర్): ఓ వ్యక్తి అంత్యక్రియలు పూర్తయిన నాలుగు రోజులకు మృతుడి ఎముకలు సేకరించిన ఘటన ఇల్లంతకుంట మండలంలోని ఓబులాపురంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఓబులాపురం గ్రామానికి చెందిన పెంటల శ్రీనివాస్(35) గత శుక్రవారం రాత్రి ఇంట్లోనే నిద్రించాడు.
శనివారం ఉదయం అతను మృతిచెందినట్లు కుటుంబసభ్యులు గుర్తించారు. అదేరోజు సాయంత్రం దహన సంస్కారాలు నిర్వహించారు. మృతుడికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. కాగా, శ్రీనివాస్ మృతిపై అనుమానం ఉందని బంధువుల్లో ఒకరు ఇల్లంతకుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో తహసీల్దార్ ఎంఏ. ఫారుక్, ఎస్సై శ్రీకాంత్ గౌడ్, సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రి వైద్యురాలు ఫాతిమా మంగళవారం ఓబులాపురం చేరుకున్నారు. మృతుడిని దహనం చేసిన స్థలానికి వెళ్లి, వైద్య సిబ్బంది సహకారంతో ఎముకలు సేకరించారు. వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించనున్నట్లు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.
Also read
- Vijayawada:పోలీస్ ల నుండి తప్పించుకునేందుకు.. అపార్ట్మెంట్ పైనుంచి దూకేసిన యువకుడు
- Guntur: కాల్ బాయ్‌గా చేస్తే సూపర్ ఇన్‌కం.. టెమ్ట్ అయి కమిటయిన కొందరు.. ఆ తర్వాత
- Hyderabad: చదువుకోమని తల్లి మందలించిందని..
- Crime News: కరీంనగర్లో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్.. ఆపై వీడియో తీసి..
- BIG BREAKING: తెనాలిలో కలకలం.. పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య!