March 15, 2025
SGSTV NEWS
Andhra Pradesh

Balineni: జగన్ నా ఆస్తులు గుంజుకున్నాడు.. ఆ పాపం ఊరికేపోదు.. బాలినేని సంచలనం!


జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్.. జగన్‌పై సంచలన ఆరోపణలు చేశారు. జగన్‌ వల్లే తన కుటుంబం ఎంతో బాధపడిందన్నారు. ‘నా ఆస్తులు, నా వియ్యంకుడి ఆస్తులను జగన్‌ కాజేశారు. అతని అన్యాయాలు చెప్పాలంటే సమయం సరిపోదు’ అంటూ సంచలనం రేపారు

Janasena: జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి.. జగన్‌పై సంచలన ఆరోపణలు చేశారు. జగన్‌ వల్లే తాను, తన కుటుంబ సభ్యులు ఎంతో బాధపడ్డామన్నారు. ‘నా ఆస్తులు, నా వియ్యంకుడి ఆస్తులను జగన్‌ కాజేశారు. జగన్‌ అన్యాయాలు చెప్పాలంటే సమయం సరిపోదు’ అంటూ సంచలనం రేపారు.



ప్రాణం ఉన్నంత వరకు అతనితోనే..

ఈ మేరకు కాకినాడ జిల్లా పిఠాపురం మండలంలోని చిత్రాడ గ్రామంలో జరుగుతున్న జనసేన జయకేతనం సభలో మాట్లాడిన బాలినేని.. ‘పిఠాపురం సాక్షిగా అన్నీ నిజాలే చెబుతా. నాకు ప్రాణం ఉన్నంత వరకు పదవి ఉన్నా, లేకపోయినా పవన్‌ కల్యాణ్ వెంటే ఉంటా. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎంతో నష్టపోయా. మా తండ్రి ఇచ్చిన ఆస్తిలో సగం అమ్మేశా. జగన్‌ వల్ల నేను, నా కుటుంబ సభ్యులు ఎంతో బాధపడ్డాం. నా ఆస్తులు, నా వియ్యంకుడి ఆస్తులను కూడా జగన్‌ కాజేశారు.


జగన్‌ చేసిన అన్యాయాలు చెప్పాలంటే సమయం సరిపోదు రఘురామకృష్ణరాజు ఏదో అన్నారని లోపల పెట్టి ఆయన్ను కొట్టించావు. చేసిన పాపాలు ఎక్కడికీ పోవు అని జగన్‌ తెలుసుకోవాలి. కూటమి ప్రభుత్వం వచ్చాక చిన్న చిన్న వారిని అరెస్టు చేస్తున్నారు. స్కాములు చేసి, రూ.కోట్లు సంపాదించిన వారిని ఇంకా అరెస్టు చేయడంలేదు.. అదే నా బాధ. వైఎస్‌ను అడ్డం పెట్టుకుని జగన్‌ సీఎం అయ్యారు. పవన్‌ కల్యాణ్‌ స్వశక్తితో ఎదిగి నాయకుడు అయ్యారు’ అని కొనియాడారు.  ఇక డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌తో సినిమా తీయాలనేది తన కోరిక అని బయటపెట్టారు. ఇదే విషయం ఆయనకు చెప్పానని అన్నారు.

Also read

Related posts

Share via