ప్రేమలో పడితే కొన్నిసార్లు ఆలోచనలకన్నా కోరికలే ముందుకు నడిపిస్తాయి. ప్రియురాళ్లకు గిఫ్ట్ ఐఫోన్ ఇవ్వాలన్న చిన్న ఆశ ఆ యువకులను పెద్ద నేరం వైపు నెట్టేసింది. కానీ వారు వేసిన ప్లాన్ మాత్రం చివరికి ఊహించని మలుపు తిరిగి కటకటాల పాలు జేసింది.
ఇద్దరు యువకులు తమ గర్ల్ఫ్రెండ్స్కు ఐఫోన్లు కొనివ్వాలనే ఉద్దేశంతో ఏకంగా రూ.6.5 లక్షల విలువైన లగ్జరీ డిజైనర్ ట్యాప్స్ను ఓ గోడౌన్ నుంచి దొంగిలించారు. కానీ ఆ ఖరీదైన వస్తువులు చివరికి కేవలం రూ.20 వేలకే స్క్రాప్ డీలర్కు అమ్మేయడం ఈ కేసులో మరో ట్విస్ట్గా మారింది.
ఓ గోడౌన్ యజమాని ఫిర్యాదుతో ఈ దొంగతనం వెలుగులోకి వచ్చింది. మే 27-28 మధ్య రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు గోడౌన్ పైకప్పులోని టిన్ షీట్లు తొలగించి లోపలికి ప్రవేశించి ఖరీదైన సానిటరీ వేర్ను ఎత్తుకెళ్లారు. గోల్డ్ టోన్, రోజ్ గోల్డ్, సిల్వర్ ఫినిష్ ఉన్న ప్రీమియం ట్యాప్స్ సహా మొత్తం రూ.6.5 లక్షల విలువైన వస్తువులు చోరీ అయ్యాయి.
కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు 20కి పైగా సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ను పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు. స్థానిక సమాచారం, టెక్నికల్ ఇన్పుట్స్ ఆధారంగా కేవలం 12 గంటల్లోనే కేసును ఛేదించారు. విచారణలో ఇద్దరు మైనర్లు సహా ఒక ప్రధాన నిందితుడు బయటపడింది పట్టుబడ్డాడు. ప్రశ్నించగా షాకింగ్ నిజం
గర్ల్ ఫ్రెండ్ కు ఐఫోన్లు కొనాలన్న కోరికతోనే ఈ దొంగతనం చేశామని వారు ఒప్పుకున్నారు. దొంగిలించిన ఖరీదైన ట్యాప్సు కేవలం రూ.20 వేలకే అమ్మినట్లు కూడా తేలింది. ఆ వస్తువులు కొనుగోలు చేసిన 38 ఏళ్ల ఇర్ఫాన్ అలీని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రేమ కోసం వేసిన “కాస్ట్లో స్కెచ్” చివరికి చీప్ బేరంలో ముగిసి, పోలీసులు కేసును ఛేదించడంతో కథ ముగిసింది. నాగ్పూర్ జరిగిన ఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Also read
- భార్య బడిత పూజకు భర్త బలి
- అమీర్ పెట్ ప్రమాదం.. స్పాట్ కు ‘హైడ్రా’ రంగనాథ్
- ప్రేమలో గొడవ.. ప్రేయసిపై ఘాతుకం
- లవర్స్ కోసం.. కుళాయిలు కొట్టేశారు
- ఇంట్లో పామును చంపారా? శాస్త్రం చెప్పిన నిజం తెలిస్తే వణకాల్సిందే!





