మహా కుంభమేళాలో సెక్టార్ 22లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో టెంట్లు అన్ని తగలబడి పోతున్నాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Fire Accident At Kumbh Mela: మహా కుంభమేళాలో మరోసారి అపశృతి చోటుచేసుకుంది. సెక్టార్ 22(Sector 22)లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో టెంట్లు అన్ని తగలబడ్డాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకుంటున్నారు. భక్తులు, వీఐపీల వసతి కోసం పెద్ద ఎత్తున టెంట్లు ఏర్పాటు చేశారు. అయితే జనవరి 19న ఇవే టెంట్లు దగ్గర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మళ్లీ ఇదే ప్లేస్‌లో టెంట్లు తగలబడటంతో భక్తులు ఆందోళనతో పరుగులు తీస్తున్నారు. అసలు మంటలు చెలరేగడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
పది రోజుల్లో మరోసారి ప్రమాదం..
మహా కుంభమేళాలో సెక్టార్ 22 ఏరియాలో భక్తుల కోసం భారీగా టెంట్లు ఏర్పాటు చేశారు. దీనికి సమీపంలోనే గంగ, యమున, సరస్వతి నదులు సంగమం ఉంటుంది. వీటి దగ్గర స్నానం ఆచరించాల్సిన వారందరూ కూడా ఇక్కడే వెళ్తుంటారు. కేవలం 10 రోజుల్లో మరోసారి అగ్ని ప్రమాదం ఘటన చోటుచేసుకుంది. మొదటిసారి గ్యాస్ సిలిండర్ల వల్ల ప్రమాదం జరిగింది.
ఇదిలా ఉండగా.. మౌని అమావాస్య సందర్భంగా బుధవారం మహా కుంభమేళాలో తొక్కిసలాట జరిగింది. ఇందులో దాదాపు 30 మందికి పైగా మృతి చెందారు. ఇంతలోనే మళ్లీ మంటలు చెలరేగడంతో భక్తులు భయాందోళన చెందుతున్నారు.
Also read
- శీర్షాసనంలో శివయ్య..!
- హైదరాబాద్ నారాయణ కాలేజీలో దారుణం
- Sattenapalle: అప్పు వివాదం.. తల్లీ కుమారుడి ఆత్మహత్య
- Kadapa: జైల్లో దస్తగిరికి బెదిరింపులు.. మరోసారి విచారణ చేపట్టిన కర్నూలు ఎస్పీ
- Gollaprollu: బాకీ తీరుస్తానంటూ బావిలోకి తోశాడు