నెల్లూరులోని 5వ పోలీసు స్టేషన్ పరిధిలో ఫైనాన్షియర్ గొల్లపల్లి చిన్నయ్య అనుమానాస్పద స్థితిలో హత్యకు గురయ్యాడు. ఆయన ఇంట్లో నిద్రలో ఉన్న సమయంలో గుర్తుతెలియని దుండగులు అతనిని హత్య చేసి పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
AP News: నెల్లూరు జిల్లాలో మరో హత్యా ఘటన కలకలం రేపుతోంది. నెల్లూరు నగరంలోని 5వ పోలీసు స్టేషన్ పరిధిలో ఫైనాన్షియర్ గొల్లపల్లి చిన్నయ్య అనుమానాస్పద స్థితిలో హత్యకు గురయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు ఈ ఘటన ఆయన ఇంట్లో నిద్రలో ఉన్న సమయంలో జరిగింది. గుర్తుతెలియని దుండగులు అతనిని హత్య చేసి పరారయ్యారు.చిన్నయ్య ఉదయగిరి నియోజకవర్గానికి చెందిన సవైరాబాద్ గ్రామానికి చెందినవాడు.
పొలం విషయంలో తాగాదాలు..
అతను వెటర్నరీ ఆసుపత్రిలో ఉద్యోగిగా పనిచేస్తూ అదే సమయంలో ఫైనాన్స్ వ్యాపారం కూడా నిర్వహిస్తున్నాడు. చిన్నయ్య ఎక్కువగా ఇళ్లను, పొలాలను కుదువ పెట్టుకొని వాటిపై వడ్డీకి డబ్బులు ఇచ్చే వాడు. గ్రామంలో ఓ పొలం విషయంలో తాగాదాలు ఉండటం కూడా ఈ హత్యకు కారణంగా భావిస్తున్నారు. ఈ హత్యపై పోలీసులు విచారణ ప్రారంభించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు, క్లూస్ టీమ్, ఫింగర్‌ప్రింట్ సేకరించారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. ఇది కేవలం వ్యక్తిగత కక్షలా.. లేక వ్యాపార సంబంధిత గొడవల కారణంగా జరిగిందా అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.ఈ సంఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతను రేపింది. చిన్నయ్య కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Also read
- Vijayawada:పోలీస్ ల నుండి తప్పించుకునేందుకు.. అపార్ట్మెంట్ పైనుంచి దూకేసిన యువకుడు
- Guntur: కాల్ బాయ్‌గా చేస్తే సూపర్ ఇన్‌కం.. టెమ్ట్ అయి కమిటయిన కొందరు.. ఆ తర్వాత
- Hyderabad: చదువుకోమని తల్లి మందలించిందని..
- Crime News: కరీంనగర్లో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్.. ఆపై వీడియో తీసి..
- BIG BREAKING: తెనాలిలో కలకలం.. పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య!