July 3, 2024
SGSTV NEWS
Andhra PradeshAssembly-Elections 2024

జుత్తిగలో పితాని సత్యనారాయణ కోడలు నాగసాహితీ ఇంటింటి ప్రచారం

జుత్తిగలో పితాని సత్యనారాయణ కోడలు నాగసాహితీ ఇంటింటి ప్రచారం

పెనుగొండలో పితాని తనయుడు భానుచందర్ ఇంటింటా ప్రచారం

పోడూరులో పితాని సత్యనారాయణ కోడలు నాగ స్వాతి

ఆచంటలో పితాని తనయుడు వెంకట్ ఎన్నికల ప్రచారం


పితాని సత్యనారాయణ కుటుంబ సభ్యులు ఇంటింటా ప్రచారం


పెనుమంట్ర/ పెనుగొండ/ పోడూరు/ ఆచంట

పరిశ్రమల స్థాపన చంద్రబాబు తోనే సాధ్యం

పితాని సత్యనారాయణ తనయుడు  భాను చందర్




రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన చేసే సత్తా చంద్రబాబుతోనే సాధ్యమని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ తనయుడు పితాని భానుచందర్ అన్నారు. సోమవారం ఆచంట నియోజకవర్గం లోని పెనుమంట్ర మండలం నత్తా రామేశ్వరం జుత్తిక గ్రామాల్లో కోడలు నాగ సాహితీ కోడూరు మండలంలో కోడలు నాగ స్వాతి పెనుగొండ మండలం పెనుగొండలో పితాని భానుచందర్ ఆచంటలో పితాని వెంకట్ ఎన్నికల ప్రచారంలో ఇంటింటి ప్రచారం ముమ్మరంగా చేశారు. ఈ సందర్భంగా పితాని భానుచందర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలను పొగ పెట్టి ఇతర రాష్ట్రాలకు తరలిపోయేలా జగన్మోహన్ రెడ్డి పారిశ్రామికవేత్తలను భయపెట్టారని ఆరోపించారు. దీంతో నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు లేక పోరుగు రాష్ట్రాలకు, ఇతర దేశాలకు నిరుద్యోగ యువతీ యువకులు ఉద్యోగాల కోసం తరలిపోయారని అన్నారు. అమరావతి రాజధానిని మూడు ముక్కలు చేసి రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను అయోమయంలో పడేసిన జగన్ రెడ్డి మాయ మాటలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు అన్నారు. ఉమ్మడి కూటమి ఆధ్వర్యంలోనే అమరావతి రాజధాని నిర్మాణం పోలవరం ప్రాజెక్టు పరిశ్రమల స్థాపన చంద్రబాబు పవన్ కళ్యాణ్ డబల్ ఇంజన్ సర్కార్ తో సాధ్యపడుతుందని అన్నారు.  సార్వత్రిక ఎన్నికల్లో ఆచంట అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థిగా పితాని సత్యనారాయణ సైకిల్ గుర్తుకు, నరసాపురం పార్లమెంట్  బిజెపి అభ్యర్థి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ కమలం గుర్తుకు ఓటు వేసి అఖండ విజయాన్ని చేకూర్చాలని ఓటర్లను అభ్యర్థించారు ఒకపక్క సంక్షేమం మరోపక్క అభివృద్ధి చేయగలిగిన సత్తా చంద్రబాబుకే ఉందని అన్నారు చంద్రబాబు ప్రభుత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు రూపొందించారని సూపర్ సిక్స్ పథకాలతో పాటు అనే దళితులకు 27 సంక్షేమ పథకాలు పునరుద్ధరించడం ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ద్వారా ఎస్సీ ఎస్టీ కాలనీల మౌలిక సదుపాయాలు కల్పించడం నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం నిరుద్యోగ భృతి వంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసే ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం అని అన్నారు అవినీతి అరాచక పాలన సాగిస్తున్న జగన్మోహన్ రెడ్డి గద్దె దింపి ఇంటికి పంపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు గత పదిహేళ్లలో పితాని సత్యనారాయణ చేసిన అభివృద్ధి ఈ ఐదేళ్లలో జరిగిన అభివృద్ధిని పరిశీలించి అభివృద్ధి ప్రదాత పితాని సత్యనారాయణకు పట్టం కట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షురాలు మాధవి లత, భూపతి రాజు ఉమాదేవి,

Also read

Related posts

Share via