కేరళలోని కోజికోడ్‌లో ఓ స్కూల్‌లో ఫేర్‌వెల్ పార్టీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెండు గ్రూపుల విద్యార్థులు మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ క్రమంలో ఓ పదవ తరగతి విద్యార్థి ఇతర విద్యార్థులపై దాడి చేయడంతో ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
కేరళలోని కోజికోడ్‌లో విద్యార్థుల మధ్య సంఘర్షణ ఒకరి ప్రాణం తీసింది. వివరాల్లోకి వెళ్తే.. కేరళలోని కోజికోడ్ జిల్లాలోని ఎలెట్టిల్‌లోని ఎంజె హయ్యర్ సెకండరీ స్కూల్‌లో ఫేర్‌వెల్ పార్టీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెండు గ్రూపుల విద్యార్థులు మధ్య ఘర్షణ చెలరేగింది. ఓ పదవ తరగతి విద్యార్థి ఇతర విద్యార్థులపై దాడి చేశాడు
విద్యార్థిపై దాడి చేయడంతో..
దీంతో ఓ విద్యార్థి తలకు తీవ్ర గాయమైంది. వెంటనే ఆ విద్యార్థిని కోజికోడ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆ విద్యార్థి మరణించాడు. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దాడి చేసిన ఐదుగురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025