July 3, 2024
SGSTV NEWS
Andhra Pradesh

ఫామిలి క్లబ్ 31వ నిర్విరామ సామాజిక సేవ.
– విశ్వసేవిక వృద్ధాశ్రమానికి నిత్యావసరములు అందజేత.



ఒంగోలు::

ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్న నానుడిని స్ఫూర్తిగా తీసుకొని ఒంగోలు నగరంలోని ఫ్యామిలీ క్లబ్ సభ్యులు గత మూడు సంవత్సరాలుగా ప్రతినెలా సామాజిక సేవలు నిర్వహిస్తున్నారు… తమ వంతు గా సమాజంలోని అనాధలు, అభాగ్యులు, వృద్ధులు, పేదవారు ఇలా అవసరార్ధులు అందరికీ తమ సాయాన్ని అందిస్తున్నారు. ప్రతి నెల రెండవ ఆదివారం నిర్వహించే తమ సేవా కార్యక్రమాన్ని ఏప్రిల్ 14వ తేదీ ఆదివారం “వృద్ధాశ్రమ సేవ” గా క్లబ్ వ్యవస్థాపకులు పొట్టి వీర రాఘవరావు అధ్యక్షతన నిర్వహించారు.



స్థానిక విఐపి రోడ్డులోని విశ్వసేవిక వృద్ధాశ్రమ మాతృమూర్తులకు నెలకు సరిపడా నిత్యవసర సరుకులను, అల్పాహారాన్ని అందించారు. మరో ఆరు పేద కుటుంబాలకు నిత్యవసర సరుకులను పంపిణిచేశారు. మన భారతీయ మూలాలను, సాంప్రదాయాలను మర్చిపోకుండా… సకల దేవతా స్వరూపంగా భావించే గోమాత సేవలో భాగంగా మడనూరు గోశాలకు దానా పంపించారు.

ఈ సందర్భంగా క్లబ్ వ్యవస్థాపకులు పొట్టి వీర రాఘవరావు మాట్లాడుతూ 2017 వ సంవత్సరంలో స్నేహితులు, ఆత్మీయ మిత్రుల సహకారంతో ఏర్పాటుచేసిన ఫ్యామిలీ క్లబ్, మూడు సంవత్సరాల క్రితం గాంధీ జయంతి సందర్భంగా తీసుకున్న నిర్ణయం ప్రకారం ప్రతినెలా రెండవ ఆదివారం తప్పనిసరిగా సేవా కార్యక్రమం అంధుల పాఠశాలలు, వృద్ధాశ్రమాలు, బధిరుల పాఠశాలలు, పేద విద్యార్థులకు విద్య ఆర్జనకై ఆర్థిక సహకారం అందించడం, రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఫ్యామిలీ క్లబ్ సభ్యులు ప్రతి ఒక్కరూ తమ వంతుగా కార్యక్రమానికి విచ్చేసి, ఆర్థికంగా సహకరిస్తూ ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమం 31 వ సామాజిక సేవగా నిర్వహించామని వివరించారు.

కార్యక్రమంలో పీవీ రాఘవరావు, కె చంద్రమౌళి, కేవీ సురేష్, పి పాండురంగారావు, కోట కిరణ్, కొల్లిపల్లి సుబ్రహ్మణ్యం, ఎన్ రామారావు, బి కె వి రమేష్, పువ్వాడ విజయకృష్ణ, పబ్లిశెట్టి శ్రీనివాసరావు, కే బాలచంద్ర ప్రసాద్, ఆర్ శ్రీనివాసరావు, ఎన్ వెంకటేశ్వర గుప్తా, మద్దాలి మధు, బైసాని శ్రీనివాసరావు లు పాల్గొన్నారు.

Also read

Related posts

Share via