December 3, 2024
SGSTV NEWS
CrimeEntertainment

Ram Gopal Varma: వర్మ.. ఏంటి నీకీ ఖర్మ?

  కనబడుట లేదు..! అని పోస్టర్లంటించడం ఒక్కటే తక్కువ. మూడు రాష్ట్రాల్లో జల్లెడ పట్టి గాలించినా దొరకడం లేదా పెద్దమనిషి. ఏపీ పోలీసుల్ని మూడు చెరువుల నీళ్లు తాపిస్తున్న ఆ శాల్తీ ఎవరనుకున్నారు.. ఇంకెవరు.. రామ్‌గోపాల్‌ వర్మ. చిక్కను దొరకను అంటూ హైడ్ అండ్ సీక్ ఆడుతున్న వర్మ కోసం వేట ఓ రేంజ్‌లో నడుస్తోంది.


కిర్రాక్ డైరెక్టర్ రామ్‌గోపాల్‌ వర్మ ఎక్కడ? ఏ రాష్ట్రంలో దాక్కున్నారు.. ఆయనకు ఎవరు ఆశ్రయమిచ్చారు.. అనే మిస్టరీ ఇంకా విడిపోలేదు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో గాలిస్తూనే ఉన్నారు ప్రకాశం జిల్లా పోలీసులు. ఈనెల 23న కోయంబత్తూరులో లూసీఫర్-2 సినిమా షూటింగ్‌లో పాల్గొన్నట్టు.. అక్కడి నటులతో తీసుకున్న వర్మ ఫొటోల్ని బట్టి తెలుస్తోంది. దీంతో వెంటనే వర్మ కోసం కోయంబత్తూరు వెళ్లినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఇటు.. వర్మ ఆచూకీ కోసం హైదరాబాదులోని ఫిలింనగర్‌లో రెండు పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. హైదరాబాద్‌, తమిళనాడు పోలీసులతో ఒంగోలు ఎస్పీ దామోదర్ నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. మద్దిపాడు పీఎస్ లో ఈనెల 10న వర్మపై కేసు నమోదైంది. సినిమా ప్రమోషన్ పేరుతో సోషల్ మీడియాలో వికృతమైన పోస్టులు పెట్టారన్నది వర్మపై నమోదైన అభియోగం. రెండుసార్లు విచారణకు పిలిచినా హాజరుకాకపోవడంతో ఆయనకు నోటీసులిచ్చారు పోలీసులు. ఇదిలా ఉంటే.. ఒంగోలు, విశాఖ, గుంటూరు జిల్లాల్లో తనపై నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ ఆర్జీవీ పిటిషన్‌ వేశారు. విచారణను రేపటికి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు.

వివాదాస్పద సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కు సోషల్ మీడియా పోస్టింగుల వ్యవహారం చివరకు అతని మెడకే చుట్టుకుంది. నిత్యం వివాదాల్లో ఉండే ఈ డైరెక్టర్ వైసీపీ మద్దతుదారుడిగా ముద్ర పడింది. వైసీపీ అధికారంలో ఉండగా టీడీపీ అధినేత, యువనేత ,జనసేన అధినేత టార్గెట్ గా పెట్టిన పోస్టింగులు ఇప్పుడు అతనిని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టాయి.  తెలుగుదేశం పార్టీ నేతలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా విశాఖ , ఒంగోలు, గుంటూరు జిల్లాలో రామ్ గోపాల్ వర్మపై వరుసగా మూడు కేసులు నమోదయ్యాయి. దీంతో ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు వర్మ నివాసానికి సైతం వెళ్లారు.  అయితే  వర్మ అందుబాటులో లేకపోవడంతో నోటీసులు అతని తరపు న్యాయవాదులకు నోటీసులు  అందించి అక్కడినుంచి వెను తిరిగారు. ఇక నవంబర్ 19నే ఆయన విచారణకు రావాల్సిన వర్మ తన లాయర్ ద్వారా రిప్లై మాత్రమే ఇచ్చారు తప్ప పోలీసులకు అందుబాటులోకి రాలేదు. అయితే సోమవారం (నవంబర్ 25)న మళ్ళీ విచారణకు రావాలని పోలీసులు సూచించిన నేపథ్యంలో నిన్న సైతం ఆయన విచారణకు డుమ్మా కొట్టారు. దీంతో తనపై నమోదు అయిన కేసులు విషయంలో రాంగోపాల్ వర్మ ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ కేసుల విషయంలో ఏం జరగబోతోంది అన్నది ఆసక్తి రేపుతోంది. అయితే వర్మ దాఖలు చేసిన పిటిషన్లను మంగళవారం విచారించిన ఏపీ హైకోర్టు రాంగోపాల్ వర్మపై నమోదైన మూడు కేసుల్లో దాఖలైన అన్ని పిటిషన్లు కలిపి ఒకేసారి విచారిస్తామని స్పష్టం చేసింది.

వర్మ లాజిక్కులపై పోలీసుల ఆగ్రహం..
రాంగోపాల్ వర్మ విషయంలో ఎట్టి పరిస్థితులను మెట్టు దిగకూడదని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు ఇచ్చిన నోటీసులు విషయంలో వర్మ పంపిన రిప్లై సైతం పోలీసులకు చిర్రుతుకొచ్చేలా చేసింది. ఏ కేసులో అయినా పోలీసులు కేసును నమోదు చేసి నోటీసులు జారీ చేసి విచారణకు హాజరుకావాలని ఆదేశిస్తే అందుకు సంబంధించి ఇచ్చేటటువంటి వివరణ పోలీసులకు సంతృప్తికరంగా ఉండాలి. అంతే కానీ పోలీసులు తనకు నోటీసులు ఇచ్చే ముందు తన అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవాలనే లాజిక్ తో వర్మ పంపిన రిప్లై పై ఇప్పుడు పోలీసులు ఆగ్రహం వచ్చేలా చేస్తున్నట్లు సమాచారం . తనకు నోటీసులు ఇవ్వడానికి రెండు వారాల ముందే ఇవ్వాలని విచారణ హాజరైనందుకు ఒక వారం సమయం ఇవ్వాలనీ వర్మ నోటీసులు పంపడంతో పోలీసులు ఈ వ్యవహారాన్ని సీరియస్ గా పరిగణిస్తున్నారు. పైగా తాను ప్రత్యక్ష విచారణకు హాజరుకానని హైబ్రిడ్ పద్ధతుల విచారణ హాజరవుతానని చెప్పడంపై పోలీసులు న్యాయ సలహా తీసుకుంటున్నారు. అయితే నిన్న విచారణ హాజరు కావలసిన రాంగోపాల్ వర్మ హాజరు కాకపోవడంతో నేడు దాఖలైన పిటిషన్ పై విచారణ జరిగిన తర్వాత రిలీఫ్ వస్తుందని మొదట భావించారు. అయితే ఈ మూడు పిటిషన్లపై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేయడంతో ఈ మూడు పిటిషన్లపై హైకోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుందన్న తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.


నిత్యం వివాదాల్లో విమర్శలకు కేంద్రంగా ఉండే రాంగోపాల్ వర్మ ఏటువంటి సినిమాలు తీసిన తాను ఎవరికి ఎప్పుడు ఎక్కడ భయపడలేదని చెప్పిన వర్మ అజ్ఞాతంలోకి వెళ్లారని సోషల్ మీడియా వేదిక పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేస్తున్నారు. అయితే రాంగోపాల్ వర్మ పై కేసు నమోదు కాగానే పోలీసులకు అందుబాటులోకి లేకపోవడం మొబైల్ ఫోన్ ఆఫ్ లో ఉండటం తో వర్మ పరారీలో ఉన్నారని పోలీసులు భావిస్తున్నారు. ఏ క్షణానైనా రాంగోపాల్ వర్మను అరెస్టు చేస్తారని సమాచారంతోనే భయపడి వెళ్లిపోయారని పోలీసులు భావిస్తుండగా ఆయన కోసం ఇంకా పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. మొబైల్ నెట్వర్క్ సిగ్నల్స్ ఆధారంగా రాంగోపాల్ వర్మ కోయంబత్తూర్ లో ఉన్నారని మొదటి భావించిన కానీ ఆయన హైదరాబాదులోనే తలదాచుకున్నారని ఎట్టి పరిస్థితులను రాంగోపాల్ వర్మను అరెస్టు చేస్తారని సమాచారంతో అజ్ఞాతంలో ఉన్నారని పోలీసులు భావిస్తున్నారు. అందులో భాగంగానే రాంగోపాల్ వర్మ తనపై నమోదైన కేసుల విషయంలో భయపడి అందుబాటులో లేకుండా పోయారన్న ప్రచారం జోరుగా సాగుతోంది వైసీపీకి అండగా ఉన్న వివాదాస్పద దర్శకుడు అయిన రాంగోపాల్ వర్మతో పాటు సినిమా ఇండస్ట్రీకి చెందిన పలవురిపై ఇప్పటికి వరుసగా కేసులు నమోదు అవుతున్నాయి. అందులో భాగంగానే పోసాని కృష్ణమురళి పై సైతం కేసు నమోదు కాగా ఇక యాంకర్ శ్యామల టార్గెట్గా సైతం టీడీపీ అడుగులు వేస్తోంది. అయితే ఈ వ్యవహారంలో ప్రశ్నించిన ప్రభుత్వ వైఫల్యాల పై మాట్లాడిన ఎక్కడా చర్యలు తీసుకోలేదని కేవలం వ్యక్తిగత దూషణలు, ఫేక్ పోస్టింగ్లు ఫోటో మార్ఫింగ్ చేసి సోషల్ మీడియా పోస్టింగుల పెట్టిన వారి వ్యవహారంలోనే చర్యలు తీసుకుంటున్నామని టీడీపీ అంటోంది.

మొత్తానికి ఏపీ హై కోర్టులో వర్మ దాఖలు చేసిన పిటిషన్ విషయంలో ఏమి జరుగుతుందన్న ఆసక్తి నెలకొంది.ఇప్పటికే ఒకసారి వర్మ దాఖలు చేసిన పిటిషన్ పై హై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేయగా ఇప్పుడు తాజాగా దాఖలు చేసిన పిటిషన్ల్పై ఏమి జరుగుతుందన్న ఆసక్తి నెలకొంది.చూడాలి మరి ఈ వ్యవహారంలో ఏమి జరుగుతుంది తెలియాలి అంటే రేపటి వరకు వేచి చూడాలి.

Also read



 

Related posts

Share via