హైదరాబాద్: పెళ్లి చేసుకోవాలని ఓ యువతిని ఒత్తిడి చేయడమే కాకుండా..ఆమె వివాహ నిశ్చితార్థాన్ని చెడగొట్టి.. వేరెవరినైనా పెళ్లి చేసుకుంటే చంపేస్తానని బెదిరించిన యువకుడిపై బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నిజామాబాద్ జిల్లా బాల్కొండ యువతి (21) నగరంలోని ఓ హాస్టల్లో సంవత్సరం చదువుతుంది.
కామారెడ్డిలో నివాసం ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేసే శేషుకుమార్ (28) గత తొమ్మిది నెలల క్రితం సదరు యువతిని బస్సులో కలిశాడు. నెల తర్వాత శేషు ఆమెను పెళ్లి చేసుకోమని అడిగాడు. దీనికి ఆమె నిరాకరించి స్నేహితులుగా ఉందామని చెప్పింది. ఈ క్రమంలో ఇరువురూ కలిసి ఫొటోలు దిగారు. ఇదిలా ఉండగా తన వివాహ నిశ్చితార్థం ఖరారు అయ్యిందని యువతి స్నేహితులకు చెప్పగా వారి ద్వారా శేషు ఆ విషయాన్ని తెలుసుకున్నాడు.
దీంతో ఈ నెల 6న సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో బేగంపేట ఫ్లైఓవర్ వద్ద ఆమెను కలుసుకుని ఘర్షణకు దిగాడు. ఆమెపై చేయి చేసుకున్నాడు. ఆమెతో వివాహ నిశ్చితార్థం జరుపుకునే యువకుడి ఫోన్ నెంబర్ తీసుకుని వారిద్దరూ దిగిన ఫోటోలను అతనికి పంపించడంతో పాటు లేనిపోని ఆరోపణలు చేశాడు. దీంతో ఆ నిశితార్థం ఆగిపోయింది. అనంతరం తనను పెళ్లి చేసుకోవాలని యువతిపై ఒత్తిడి పెంచాడు. తనను కాదని వేరే వారిని పెళ్లి చేసుకుంటే చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- లేడీ కాదు.. మహా కిలాడీ.. వైద్యురాలిగా నటిస్తూ!
- సాహితీవేత్తా దుర్గాప్రసాద్ ఉగాది పురస్కారం ఇవ్వనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
- పరాభావ నామసంత్సరం అంటే అన్నీ పరాభావాలేనా? పండితులు ఏమంటున్నారంటే?
- Watch Video: ఏటీఎంలో చోరీకి విఫల యత్నం.. సైరన్ మోగడంతో పరార్! ఎక్కడంటే..
- ఆరుగురు మహిళలు.. ధూమ్ సినిమా రేంజ్లో ప్లాన్.. చివరకు జరిగిందిదే..





