Prostitution racket: అరుణాచల్ ప్రదేశ్ పోలీసులు సెక్స్ రాకెట్ను ఛేదించారు. మైనర్ బాలికలను రక్షించారు. ఐదుగురు ప్రభుత్వ అధికారులు సహా 21 మందిని అదుపులోకి తీసుకున్నారు.
ఇటానగర్: అంతర్ రాష్ట్ర వ్యభిచార రాకెట్తో (Prostitution racket) ప్రమేయం ఉందనే ఆరోపణలపై ప్రభుత్వ అధికారులతో సహా 21 మందిని అరుణాచల్ ప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. 10-15 ఏళ్లలోపు ఐదుగురు మైనర్లను రక్షించినట్లు బుధవారం వెల్లడించారు. అరెస్టయిన ప్రభుత్వ అధికారుల్లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP), డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ కూడా ఉన్నారని తెలిపారు.
ఇటానగర్లో బ్యూటీ పార్లర్ను నడుపుతున్న ఇద్దరు మహిళలు అస్సాంలోని ధేమాజీ నుంచి మైనర్లను అరుణాచల్కు తీసుకొచ్చారని ఎస్పీ రోహిత్ రాబ్బీర్ సింగ్ తెలిపారు. చింపులో మైనర్ బాలికలతో వ్యభిచారం నిర్వహిస్తున్నారంటూ మే 4న వచ్చిన సమాచారం మేరకు వరుస దాడులు నిర్వహించారు. పలువురిని అదుపులోకి తీసుకోవటంతో పాటు బాధిత మైనర్లను రక్షించారు. ఉద్యోగాల పేరిట ధేమాజీ నుంచి తీసుకొచ్చిన తర్వాత తమను బలవంతంగా వ్యభిచారంలోకి నెట్టారని మైనర్లు వాపోయారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు చైల్డ్ వెల్ఫేర్ కమిషన్కు సమాచారం ఇచ్చారు.
విచారణలో మరో ఇద్దరు మైనర్లు కూడా మహిళల అధీనంలో ఉన్నట్లు గుర్తించారు. మరో బాలికను ఇతర ప్రాంతానికి తరలించినట్లు తెలుసుకున్నారు. వీరందరినీ రక్షించి ప్రస్తుతానికి వసతి గృహానికి తరలించారు. వ్యభిచార గృహ నిర్వహణతో సంబంధం ఉన్న మొత్తం 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐదుగురు ప్రభుత్వ అధికారులు సహా 11 మంది విటులను అరెస్టు చేశారు.
Also read
- Hyd Murder: 70 ఏళ్ల వృద్ధురాలిని చంపిన 17 ఏళ్ల బాలుడు.. డెడ్ బాడీపై డ్యాన్స్ చేస్తూ వీడియో తీసి!
- ఒకరితో సహజీవనం..మరొకరితో పెళ్లి..
- ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్.. నాగలక్ష్మీ, సరళ ఎక్కడికి వెళ్లినట్లు..!
- సంబంధం కుదరడం లేదని యువకుడి బలవన్మరణం
- పూజ అయిపోయిన వెంటనే చేయకూడని 5 పనులు ఇవే..అలా చేస్తే దరిద్రం తప్పదు!