SGSTV NEWS online
Andhra Pradesh

అల్లూరి జిల్లాలో కూలిన డ్రోన్.. యుద్ధం వేళ గిరిజన ప్రాంతాల్లో కలకలం!


అల్లూరి సీతారామరాజు జిల్లాలో శుక్రవారం ఉదయం ఓ డ్రోన్ కూలిపోయింది. గిరిజన ప్రాంతాల్లో డ్రోన్ క్రాష్ కావడంతో వారు ఆందోళనకు గురయ్యారు.

పాడేరు: అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఒక భారీ డ్రోన్ కూలిపోవడం స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఒకవైపు అంతర్జాతీయంగా యుద్ధ మేఘాలు కమ్ముకున్న తరుణంలో, ఒక్కసారిగా ఆకాశం నుండి పెద్ద డ్రోన్ వచ్చి పడటంతో గిరిజనులు భయాందోళనలకు గురయ్యారు. పాడేరు నియోజకవర్గం జి.మాడుగుల మండలం గిమ్మరాజుపాడు పంచాయతీ పరిధిలోని బొయితిలి గ్రామం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

అసలేం జరిగిందంటే?
ఏజెన్సీ ప్రాంతాల్లో అత్యవసర వైద్య సేవలు, మెడికల్ సరఫరా కోసం రెడ్ వింగ్ (Red Wing) అనే సంస్థ డ్రోన్ల ద్వారా ట్రయల్ రన్ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో సాంకేతిక లోపం కారణంగా ఒక డ్రోన్ అదుపు తప్పి సమీపంలోని చెట్లను ఢీకొట్టి కుప్పకూలిపోయింది. డ్రోన్ పడిపోయిన శబ్దం విన్న గిరిజనులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని ఆ వింత యంత్రాన్ని ఆశ్చర్యంగా చూశారు.
అదృష్టవశాత్తూ ఈ డ్రోన్ జనావాసాలపై పడకపోవడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఒకవేళ ఇళ్లపై పడి ఉంటే భారీ నష్టం జరిగి ఉండేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై అధికారులు సమాచారం సేకరిస్తున్నారు.

Also read

Related posts