SGSTV NEWS online
Andhra PradeshCrime

Tirumala: తెరవెనుక అపచారం.. తెర ముందు విచారం

తిరుపతి: తిరుమల క్షేత్రం ప్రశాంతతకు, పవిత్రతకు మారుపేరు. అలాంటి చోట కొద్ది రోజులుగా జరుగుతున్న వరుస ఘటనలు చూస్తుంటే.. ఇవి యాదృచ్చికంగా జరుగుతున్నవి కావని, దీని వెనుక ఏదో ‘కనిపించని హస్తం’ ఉందన్న అనుమానాలు బలపడుతున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో శాంతిభద్రతలు విఫలమయ్యాయని, హిందూ ధర్మానికి రక్షణ లేదని చిత్రీకరించేందుకు ఓ వర్గం ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
2014-19 మధ్య తెదేపా అధికారంలో ఉన్నప్పుడు కూడా తిరుమలలో ఇలాంటి అపశ్రుతులే చోటుచేసుకున్నాయి.

అప్పట్లో రమణదీక్షితుల వ్యవహారంలో అనేక ఆరోపణలతో ప్రభుత్వాన్ని బదనాం చేశారు. తాజాగా భూదేవి కాంప్లెక్స్ వద్ద మద్యం సీసాలు దొరకడం, శ్రీదేవి కాంప్లెక్స్ వద్ద ఓ వ్యక్తి మద్యం మత్తులో వీరంగం సృష్టించడం, తిరుమలలో అన్యమత ప్రార్థనలు చేయడం, అలిపిరి వద్ద మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి లేవనెత్తిన విష్ణుమూర్తి విగ్రహం వివాదం.. వంటివి చాలానే జరిగాయి. ఈ ఘటనలన్నీ ప్రభుత్వాన్ని, తితిదే పాలకమండలిని లక్ష్యంగా చేసుకుని జరుగుతున్నవేనని, దీని వెనుక వైకాపా సానుభూతిపరుల హస్తం ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

పటిష్ఠ నిఘాలోనూ చొరబాట్లా?

అలిపిరి తనిఖీ కేంద్రం కట్టుదిట్టమైన భద్రతా ప్రదేశాల్లో ఒకటి. అయినా వందల సంఖ్యలో మద్యం సీసాలు, వేల గుట్కా ప్యాకెట్లు కొండపైకి ఎలా వెళ్తున్నాయి? తనిఖీ సిబ్బంది కళ్లుగప్పారా? లోపలి నుంచి ఎవరైనా సహకరిస్తున్నారా? అన్న కోణంలో విచారణ సాగుతోంది. మరోవైపు తితిదే విజిలెన్స్ విభాగం 2025-26లో సేకరించిన డేటా సైతం తీవ్రతకు అద్దం పడుతోంది.

అలిపిరి తనిఖీ కేంద్రంలో మద్యం, గంజాయితోపాటు 161 డ్రోన్ కెమెరాలు పట్టుపడటం, అంతకు మించి కళ్లజోడులో అమర్చిన 46 స్పై కెమెరాలు దొరకడం పరిస్థితికి అద్దం పడుతోంది. సాధారణ భక్తులు స్పై కెమెరాలతో ఎందుకు వస్తారు? తిరుమలలో రహస్య వీడియోలు తీసి, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసేందుకే వీటిని తెస్తున్నారా? అన్నది ప్రధాన ప్రశ్న.

తిరుమల మద్యం సీసాల కేసులో పట్టుబడిన నిందితులను విచారిస్తున్న పోలీసులు.. వారు ఎవరి ప్రోద్బలంతో ఈ పనులు చేస్తున్నారనే కూపీ లాగుతున్నారు.

Also Read

Related posts