మధురవాడ: టీడీపీ మాజీ ఎమ్మెల్సీకి చెందిన చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న డిప్లొమా విద్యార్థి బలవన్మరణానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. పీఎంపాలెం పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పార్వతీపురం మన్యం జిల్లా నర్సిపురం బీజీ కాలనీకి చెందిన నిండుగొండ శంకరరావు, జ్ఞానేశ్వరి కుమారుడు జ్యోతి ప్రకాశ్ (16) విశాఖ నగర శివారు కొమ్మాది చైతన్య వ్యాలీలోని చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో డిప్లమా మెకానికల్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు
కళాశాలలోని బాయ్స్ హాస్టల్ బ్లాక్ ఎఫ్-7లో ఏడుగురు విద్యా- ర్థులతో కలిసి ఉంటున్నాడు. శుక్రవారం తల్లితో ఫోన్లో మాట్లాడిన జ్యోతి ప్రకాశ్.. అక్టోబర్ మొదటి వారంలో పరీక్షలు ఉండడంతో ఆందోళనగా ఉందని చెప్పాడు. శనివారం ఉదయం కాస్త కడుపు నొప్పిగా ఉందని, క్లాసుకి వెళ్లలేనని తల్లికి మళ్లీ ఫోన్ చేసి చెప్పాడు. దీంతో ఆమె వార్డెన్కు ఫోన్ చేసి హాస్టల్లో ఉంచాలని చెప్పింది. మధ్యాహ్నం 1.30 సమయంలో ఇదే గదిలో ఉంటున్న సహచర విద్యార్థి తలుపు కొట్టగా తియ్యలేదు.
దీంతో హాస్టల్ సిబ్బంది బలవంతంగా తలుపులు తీయగా.. జ్యోతిప్రకాశ్ ఫ్యాన్కి ఉరేసుకుని ఉన్నాడు. వైద్యం నిమిత్తం సమీపంలోని గాయత్రి హాస్పిటల్కి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విద్యార్థి మృతికి గల కారణాలు తెలియరాలేదని పీఎంపాలెం సీఐ గేదెల బాలకృష్ణ చెప్పారు. కాగా కొద్ది నెలల క్రితం ఇదే క్యాంపస్లో ఓ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఒకే ఏడాదిలో ఇద్దరు విద్యార్థులు చనిపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. తల్లి జ్ఞానేశ్వరి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Also read
- తుని ఘటన: టీడీపీ నేత నారాయణరావు మృతదేహం లభ్యం
- Telangana: అయ్యయ్యో.. ఇలా దొరికిపోతారని అనుకోలేదు.. ట్విస్ట్ మామూలుగా లేదుగా.. వీడియో వైరల్..
- పెళ్లి కోసం వచ్చిన వ్యక్తికి ఫుల్గా తాగించిన మైనర్లు.. తర్వాత ఏం చేశారో తెలిస్తే.. ఫ్యూజులెగరాల్సిందే
- Andhra: కడుపునొప్పితో మైనర్ బాలిక ఆస్పత్రికి.. ఆ కాసేపటికే..
- విజయవాడలోని ఈ ప్రాంతంలో భయం..భయం.. ఎందుకో తెలిస్తే అవాక్కే..





