SGSTV NEWS
Spiritual

Dhanteras 2025: సంపద, శ్రేయస్సు కోసం ధన త్రయోదశి రోజున ధన్వంతరిని ఎలా పూజించాలంటే..



2025 లో ధన్ తేరాస్ అక్టోబర్ 18వ తేదీ శనివారం జరుపుకోనున్నారు. హిందూ పంచాంగం ప్రకారం త్రయోదశి తిథి అక్టోబర్ 18 ఉదయం ప్రారంభమై అక్టోబర్ 19 తెల్లవారుజాము వరకు కొనసాగుతుంది. లక్ష్మీదేవి, కుబేరుడు, ధన్వంతరి దేవిని పూజించడానికి అత్యంత పవిత్రమైన పూజ ముహూర్తం సాయంత్రం 7:16 నుంచి రాత్రి 8:20 మధ్య ఉంది. ఇది ప్రదోష కాలంతో సమానంగా ఉంటుంది. ఇది ఆనందాన్ని, శ్రేయస్సును ఆకర్షించే ఆచారాలను నిర్వహించడానికి అనువైన సమయం.

దీపావళి పండగ ఆశ్వయుజ మాసం కృష్ణ పక్షం లోని త్రయోదశి రోజు నుంచి మొదలవుతుంది. ఈ రోజుని ధన త్రయోదశిగా జరుపుకుంటారు. దీనినే ధన్ తేరస్ అని కూడా అంటారు. ఈ రోజున ధన్వంతరి జన్మదినం. అందుకనే ఆరోగ్యం, దీర్ఘాయువు , శ్రేయస్సుకు కారకుడైన ధన్వంతరికి అపారమైన ప్రాముఖ్యత కలిగి ఉంది. పురాణాల ప్రకారం ధన్వంతరి సముద్ర మంథనం సమయంలో సముద్రం నుంచి అమృత భాండాన్ని తీసుకుని ఉద్భవించాడు. ఇది శాశ్వతమైన శక్తి , సమృద్ధిని సూచిస్తుంది. ఈ పవిత్రమైన రోజున భక్తులు వ్యాధుల నుంచి విముక్తి పొందాలని, ధన్వంతరి ఆశీస్సులతో మంచి ఆరోగ్యమైన జీవితం లభించాలని ఆయనను పూజిస్తారు.


2025 లో ధన్ తేరాస్ అక్టోబర్ 18వ తేదీ శనివారం జరుపుకోనున్నారు. హిందూ పంచాంగం ప్రకారం త్రయోదశి తిథి అక్టోబర్ 18 ఉదయం ప్రారంభమై అక్టోబర్ 19 తెల్లవారుజాము వరకు కొనసాగుతుంది. లక్ష్మీదేవి, కుబేరుడు, ధన్వంతరి దేవిని పూజించడానికి అత్యంత పవిత్రమైన పూజ ముహూర్తం సాయంత్రం 7:16 నుంచి రాత్రి 8:20 మధ్య ఉంది. ఇది ప్రదోష కాలంతో సమానంగా ఉంటుంది. ఇది ఆనందాన్ని, శ్రేయస్సును ఆకర్షించే ఆచారాలను నిర్వహించడానికి అనువైన సమయం.

వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం ఈ కాలంలో కొన్ని ధన్వంతరి ఆచరంతో పూజించడం వలన సంపద (ధనం), ఆరోగ్యం (ఆయుష్యం), శాంతిలకు సంబంధించిన గ్రహ ప్రభావాలు సమన్వయం అవుతాయి. ఈ ధన్ తేరాస్ రోజున ధన్వంతరి నుంచి శ్రేయస్సు, తేజస్సు ఆశీర్వాదాన్ని కోరుతూ నిర్వహించాల్సిన మూడు ప్రత్యేక ఆచారాలు ఏమిటో తెలుసుకుందాం..


పంచామృతం, వైద్య మూలికలను సమర్పించండి:
ధన్వంతరికి పంచామృతం, పాలు, పెరుగు, నెయ్యి, తేనె , చక్కెరతో పాటు తులసి, వేప ఆకులు, గిలోయ్ లేదా అశ్వగంధ వంటి ఆయుర్వేద మూలికల మిశ్రమాన్ని అందించడం ద్వారా ధన్‌తేరస్ పూజను ప్రారంభించండి. నైవేద్యాన్ని సమర్పించేటప్పుడు.. “ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరాయే అమృత-కలశ హస్తాయ సర్వ-అమాయ వినాశాయ త్రైలోక్య నాథాయ ధన్వంతి మహా-విష్ణవే నమః” అని జపించండి. ఈ విధంగా చేయడం వలన సానుకూల గ్రహ శక్తులను, ముఖ్యంగా బృహస్పతితో అనుసంధానించబడిన శక్తులను పెంచుతుంది. ఇంటికి ఆరోగ్యం, తేజస్సు, శ్రేయస్సును ఆహ్వానిస్తుంది.

ధన్వంతరి దీపం వెలిగించండి:
శుభ ముహూర్తంలో తులసి, వేప ఆకులతో స్వచ్ఛమైన నెయ్యి దీపం (దీపం) వెలిగించడం వలన వ్యాధులు, చీకటి తొలగిపోతాయి. ధన్వంతరి ప్రతిమ ముందు దీపాన్ని ఉంచి, కనీసం 11 సార్లు “ఓం ధన్వంతరాయే నమః” లేదా ధన్వంతరి స్తోత్రాన్ని జపించండి. పూజ చేసే సమయం అంతా దీపం స్థిరంగా వెలగాలి. దీపం నిరంతర జ్వాల నిరంతర సమృద్ధి ప్రవాహాన్ని సూచిస్తుంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం ఈ చర్య గురు, శుక్ర గ్రహాల శుభ ప్రభావాలను బలపరుస్తుంది. ఆరోగ్యం, శ్రేయస్సును తెస్తుంది.

ఈ వస్తువులను కొని ఇంటికి తీసుకుని రండి
ధన త్రయోదశి రోజున బంగారం, వెండి లేదా
రాగిని కొనడం ఒక సంప్రదాయం. అయితే ఈ పనిని పవిత్ర ఉద్దేశ్యంతో చేసినప్పుడు.. అది శక్తివంతమైన ఆధ్యాత్మిక చర్యగా మారుతుంది. ముహూర్త సమయంలో రాగి పాత్ర, ఆయుర్వేద పాత్ర లేదా ధన్వంతరి యంత్రాన్ని కొనండి. దానిని ఇంటికి తీసుకువచ్చిన తర్వాత గంగా జలం,పసుపు నీటితో కడిగి ఆపై పూజగదిలో ఉంచండి. ధన్వంతరి నామాన్ని ఉచ్చరిస్తూ పువ్వులతో పూజ చేయండి. ధూపం వేయండి. ఈ పవిత్రత భౌతిక సమృద్ధిని ఆధ్యాత్మిక కృపతో అనుసంధానిస్తుంది. జీవితంలో శ్రేయస్సును ఇచ్చే శక్తులను పెంచుతుంది

Also read

Related posts