తిరుపతి టెంపుల్ సిటీలో పోలీసుల డ్రోన్ నిఘా కొనసాగుతోంది. నగర పరిసరాల్లో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై కఠినంగా నిఘా పెట్టిన పోలీసులు, డ్రోన్ సాయంతో మత్తు ఇంజక్షన్లు వినియోగిస్తున్న ఇద్దరు యువకులను పట్టుకున్నారు. తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాల మేరకు డ్రోన్ పర్యవేక్షణ నిరంతరం కొనసాగుతోంది.
టెంపుల్ సిటీ తిరుపతిలో పోలీసుల డ్రోన్ నిఘా కొనసాగుతోంది. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాల మేరకు నగరంలోని వివిధ ప్రాంతాలపై డ్రోన్ సర్వైలెన్స్ నిరంతరం జరుగుతోంది. ఈ డ్రోన్ ప్రధానంగా నగర పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలను గుర్తించడంపై దృష్టి సారించింది. పాతబడిన భవనాలు, నిర్మానుష్యమైన శివారు ప్రాంతాలపై ఎగురుతూ, డ్రోన్ ద్వారా పేకాట స్థావరాలు, గంజాయి, మత్తు పదార్థాల వినియోగం వంటి కార్యకలాపాలను పర్యవేక్షిస్తోంది.
ఇందులో భాగంగా వెస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజన్న పార్క్ సమీపంలో ఉన్న ఇరిగేషన్ ఆఫీస్ వెనుక భాగంలో ఎగరేసిన డ్రోన్.. ఇద్దరు యువకులను మత్తు ఇంజెక్షన్లు తీసుకుంటుండగా పట్టించింది. దీంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని, ఇద్దరు యువకులను పట్టుకున్నారు. వారి వద్ద నుండి మత్తు ఇంజెక్షన్లు, మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసిన పోలీసులు, మత్తు పదార్థాల మాయలో పడకుండా యువత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
Also read
- నేటి జాతకములు 10 సెప్టెంబర్, 2026
- Hyderabad: ఇంట్లో గడియ పెట్టుకుని బయటకు రాని లేడీ డాక్టర్.. తొంగి చూసి అంతా షాక్!
- కాళ్ల పారాణి ఆరకముందే తీరని విషాదం.. పాపం పెళ్లైన 6 రోజులకే వరుడు..
- పగలు భక్తులు.. రాత్రయితే దొంగలు.. దేవుడి సొమ్ము ఎలా దోచుకుంటున్నారో తెలుసా..?
- కారు కొనిచ్చి, రూ. 40 లక్షలు ఆర్థిక సహాయం.. ప్రియుడి చేసిన పనికి సాఫ్ట్వేర్ యువతి షాకింగ్ నిర్ణయం!





