SGSTV NEWS online
CrimeNational

DGP Ramachandra Rao: ఆఫీస్ లో రాసలీలలు.. డీజీపీ ర్యాంకు అధికారి బాగోతం

డీజీపీ ర్యాంక్ ఐపీఎస్ అధికారి (Karnataka DGP-rank IPS officer) తన కార్యక్రమం లో మహిళలతో సన్నిహితంగా ఉన్న వీడియోలు బయటకు రావడంతో కర్ణాటకలో వివాదం చెలరేగింది. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియోల్లో కర్ణాటక సీనియర్ పోలీసు అధికారి కె.రామచంద్రరావు తన కార్యాలయంలో పలువురు మహిళలతో సన్నిహితంగా ఉన్నట్లు కనిపిస్తోంది.

డీజీపీ కార్యాలయంలోని సిబ్బంది ఈ దృశ్యాలను రహస్యంగా చిత్రీకరించినట్లు తెలుస్తోంది. విధి నిర్వహణ సమయంలో సీనియర్ అధికారి ఇలా ప్రవర్తించడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వివాదం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దృష్టికి వెళ్లడంతో ఘటనపై దర్యాప్తు చేసి, వివరణ ఇవ్వాలని సంబంధిత శాఖకు సూచించారు. సోషల్ మీడియాలో వైరల్గా మారిన దృశ్యాలపై దర్యాప్తు కొనసాగుతోందని.. అవి నిజమని తేలితే సదరు అధికారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు పేర్కొన్నారు.


అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోలు నిజం కావని.. తన ఫొటోలను మార్ఫింగ్ చేశారని సీనియర్ పోలీసు అధికారి రామచంద్రరావు పేర్కొన్నారు. తనను ఉద్యోగం నుంచి తొలగించడానికి నా పైఅధికారులు ఉద్దేశపూర్వకంగా ఇలా చేశారని ఆరోపించారు. కాగా గతేడాది బంగారం అక్రమరవాణా కేసులో అరెస్టైన కన్నడ నటి రన్యారావు (Ranya Rao)కు రామచంద్రరావు సవతి తండ్రి. అప్పట్లో బంగారం అక్రమ రవాణా కేసులో ఆయన పేరు వాడుకునే విమానాశ్రయాల్లో రన్యారావు భద్రతా తనిఖీలను తప్పించుకునేదని ఆరోపణలు వచ్చాయి.

Also read

Related posts