Swiggy Delivery Boy Scam: కష్టపడుతూ ఎన్నాళ్లని పని చేస్తాం.. కొడితే జాక్ పాట్ కొట్టాలని కొంతమంది మోసాలకు పాల్పడుతుంటారు. అమాయకులను టార్గెట్ చేసి స్కామ్ లకు పాల్పడుతుంటారు. తాజాగా స్విగ్గీ డెలివరీ బాయ్ కూడా భారీ స్కామ్ కి పాల్పడ్డాడు.
చాలామంది ఇప్పుడు ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ పెట్టడంపై ఆధారపడిపోతున్నారు. ఒకప్పటిలా రెస్టారెంట్ కి వెళ్లి తినడమో, పార్సిల్ తెచ్చుకోవడమో అంటే పెద్ద పని కింద ఫీలవుతున్నారు. ఇంట్లో ఉండి ఫోన్ లో నిమిషంలో ఆర్డర్ పెడితే 20, 30 నిమిషాల్లో ఇంటికి తెచ్చి ఇచ్చేస్తారు కదా అని ఆలోచిస్తున్నారు. అయితే కస్టమర్ల బద్దకాన్ని కొంతమంది డెలివరీ బాయ్స్ క్యాష్ చేసుకుంటున్నారు. మోసాలకు పాల్పడుతున్నారు కొంతమంది సమోసా గాళ్ళు. ఇలాంటి వాళ్ళ వల్ల మంచి వాళ్లపై కూడా తప్పుడు అభిప్రాయం ఏర్పడుతుంది. ఆన్ లైన్ లో ఫోన్లు, ల్యాప్ టాప్ లు వంటి వస్తువులు ఆర్డర్ చేసుకుంటే ప్యాకింగ్ లో రాళ్లు ఉన్నట్టు.. ఇప్పుడు ఫుడ్ ఆర్డర్ చేసుకుంటే కూడా మనం ఆర్డర్ చేసిన ఫుడ్ రావడం లేదు. అయితే అందరికీ ఇలా జరగదు. ఎక్కడో ఒకరిద్దరికి ఇలా జరుగుతుంది.
ఉదాహరణకు మీరు ఒక పేరున్న హోటల్ లో బిర్యానీ ఆర్డర్ పెట్టారనుకుందాం. అయితే అక్కడ నుంచే మీకు పార్సిల్ వస్తుందనుకుంటే పొరపాటే. ఆ బిర్యానీ ఆర్డర్ ని డెలివరీ బాయ్ ఉంచుకుని.. మీకు రోడ్డు పక్కన ఉండే హోటల్ లో దొరికే చీప్ బిర్యానీ పార్సిల్ కట్టి పంపిస్తాడు. కొంతమంది డబ్బు కోసం కక్కుర్తి పడే వాళ్ళు ఇలా చేస్తారు. కొంతమంది కస్టమర్లు కూడా దీనిపై ఫిర్యాదులు చేశారు. కొన్నిసార్లు హోటల్ వాళ్ళే ఇలా చేస్తారన్న టాక్ కూడా ఉంది. అందుకే టేస్ట్ కూడా మునుపటిలా ఉండదు అని అంటారు. తాజాగా ఇలాంటి ఘరానా మోసమే ఓ డెలివరీ బాయ్ చేశాడు.
ఇలా ఎన్నాళ్ళు డెలివరీ బాయ్ గా చేస్తాం అని చెప్పి.. ఘరానా మోసానికి తెరలేపాడు. సికింద్రాబాద్ లో ఉంటున్న సందీప్ అనే వ్యక్తి.. స్విగ్గీలో డెలివరీ బాయ్ గా చేస్తున్నాడు. గ్రిల్ 9 హోటల్ పేరుతో ఒక ఫేక్ హోటల్ ని క్రియేట్ చేశాడు. అసలైన హోటల్ కి ఎదురుగా ‘గ్రిల్ 9 ఆన్’ అనే నకిలీ హోటల్ ని పెట్టాడు. దాని మీద నకిలీ పాన్ కార్డు, నకిలీ జీఎస్టీ, ఫుడ్ లైసెన్స్ తీసుకుని గ్రిల్ 9 హోటల్ పేరు మీద బ్యాంక్ ఖాతా తెరిచాడు. అసలైన గ్రిల్ 9 హోటల్ నుంచి ఫుడ్ ఆర్డర్స్ తీసుకెళ్లేవాడు సందీప్. కానీ డబ్బులు మాత్రం అసలైన హోటల్ కి చెందిన బ్యాంక్ ఖాతాలో జమ కావడం లేదు. దీంతో ఒరిజినల్ హోటల్ యజమాని రోషన్ ఖాన్.. ఏంటని స్విగ్గీ సంస్థను అడగ్గా.. సంస్థకు చెందినవారు పేమెంట్ చేశామని చెప్పారు. దీంతో ఒక్కసారిగా హోటల్ యజమాని కంగుతిన్నారు.
డెలివరీ బాయ్ సందీప్ ని అడగ్గా.. గ్రిల్ 9 పేరుతో క్రియేట్ చేసిన నకిలీ హోటల్ ఖాతాలో డబ్బులు జమ అవుతున్నట్లు తెలుసుకున్నాడు. తన హోటల్ నుంచి ఆర్డర్లు తీసుకెళ్లడం.. డబ్బులు తన ఖాతాలో వేయించుకోవడం జరిగేది. స్విగ్గీ తరహాలోనే జొమాటో ద్వారా కూడా మోసం చేసే ప్రయత్నం చేశాడు సందీప్. గ్రిల్ 9 యజమాని రోషన్ ఖాన్ ని మేనేజర్ గా సందీప్ తొలగించినట్లు.. గ్రిల్ 9 హోటల్ యజమాని మారుతున్నట్లు అసలైన హోటల్ యజమానికి మెసేజ్ వెళ్లడంతో ఆయన అలర్ట్ అయ్యారు. అసలు విషయం తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం సందీప్ ని పోలీసులు రిమాండ్ కి తరలించారు. అలానే స్విగ్గీ సర్వీస్ పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. రోజూ పదుల సంఖ్యలో ఆర్డర్లు వస్తాయని.. సందీప్ వల్ల లక్షల్లో నష్టపోయానని రోషన్ ఖాన్ అన్నారు.
Also read
- నేటి జాతకములు 22 నవంబర్, 2024
- తెలంగాణ : అయ్యో..పాపం..వీళ్లు బంధువాలా.. రాబందువులా?.. ఆస్తిని కాజేసి చివరికి..
- ఈ ఆంజనేయ స్వామి కొండ ఎక్కితే.. పచ్చగా మారుతున్న భక్తులు
- చెల్లి ఫొటోతో ఎఫ్బీ అకౌంట్..యువకుడి నుంచి కోట్లువసూలు, ట్విస్ట్ సూపర్
- అమ్మాయితో మాట్లాడాడని ఇంటర్ విద్యార్థిపై దాష్టీకం కోనసీమలో నలుగురు యువకుల దౌర్జన్యం