యూపీలో కూతురు వేరే కులం అయిన ట్యాక్సీ డ్రైవర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుందని ఆమెను తండ్రి, సోదరుడు చంపేశారు. అక్కడితో ఆగకుండా ఆమెను దహనం కూడా చేశారు. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. వేరే కులం అనే ఆమెను చంపారు.
ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ట్యాక్సీ డ్రైవర్‌ను కూతురు పెళ్లి చేసుకుందని తండ్రి, సోదరుడు దారుణానికి ఒడిగట్టారు. వివరాల్లోకి వెళ్తే.. నోయిడాలో ఉంటున్న ఓ జంట స్కూల్ డేస్ నుంచి ప్రేమించుకుంటున్నారు. ఇంట్లో వాళ్లు వారి పెళ్లికి ఒప్పుకోలేదని.. ఇటీవల ఆర్య సమాజ్‌లో వివాహం చేసుకున్నారు.
వేరే కులం అబ్బాయిని పెళ్లి చేసుకుందని..
ఆ తర్వాత రిజిస్ట్రార్ మ్యారేజ్ చేసుకోవడానికి వెళ్తుండగా ఆ అమ్మాయి తండ్రి, సోదరుడు మార్గమధ్యంలో ఆ యువతిని హత్య చేశారు. ట్యాక్సీ డ్రైవర్ అయినా ఆ అబ్బాయి వేరే కులం కావడం వారికి ఇష్టం లేక కన్న కూతురినే హత్య చేశారు. ఆ తర్వాత ఆమె మృత దేహాన్ని కూడా దహనం చేశారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని ఆ యువతి తండ్రి, సోదరుడిని అరెస్టు చేశారు. వేరే కులం అబ్బాయిని పెళ్లి చేసుకుందనే కారణంతోనే ఇలా చేసినట్లు తండ్రి, సోదరుడు ఒప్పుకున్నారు
Also Read
- నేటి జాతకములు..24 జనవరి, 2026
- Crime News: ఎంతకు తెగించార్రా.. ఆ పని తప్పని చెప్పిన పాపానికి.. ఇంతలా వేధిస్తారా?
- దారుణం.. విషం తాగి ఫ్యామిలీ మాస్ సూసైడ్! ముగ్గురు మృతి
- Crime News: ఎవడు మమ్మీ వీడు.. ప్రేయసి ముక్కు కోసి ఎత్తుకెళ్లిన ప్రియుడు.. ఎందుకో తెలిస్తే
- Medak: ప్రేమ పెళ్లి.. పేరెంట్స్‌ను కౌన్సిలింగ్‌కు పిలిచిన పోలీసులు.. ఆపై ఊహించని సీన్..





