April 11, 2025
SGSTV NEWS
CrimeTelangana

అత్త మరణం తట్టుకోలేక ఆగిన కోడలు గుండె!

యాదాద్రి, మార్చి 17: అత్తాకోడళ్ల పోరు దాదాపు ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. అయితే ఎలాంటి అరమరికలు లేకుండా తల్లీకూతుళ్లు మాదిరి మెదిలే వారు చాలా అరుదు. అలాంటి ఓ ఇంట్లో తాజాగా విషాదం చోటు చేసుకుంది. గుండె పోటుతో అత్త మరణించిందని ఆ కోడలు గుండెలు బాదుకుంటూ రోధించింది. అత్త మరణాన్ని తట్టుకోలేక తీవ్ర మనోవేదనకు గురైన కోడలు.. గుండెలు పగిలేలా రోదిస్తూ అత్త మృతదేహం వద్దనే కుప్పకూలింది. అత్త మరణించిన గంటల వ్యవధిలోనే ఆమె కూడా మరణించింది. ఈ విషాద ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆదివారం ఉదయం (మార్చి 17) చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..



యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టమండలం దాతర్పల్లి పరిధిలోని గొల్ల గుడిసెలులో నివాసం ఉంటోన్న భారతమ్మ ఆదివారం ఉదయం (మార్చి 17) గుండెపోటుతో మృతి చెందింది. అత్త మృతిని తట్టుకోలేక కోడలు మంగమ్మ గుండెలవిసేలా రోధించింది. ఉదయం నంచి అత్త మృతదేహం వద్ద విలపిస్తూనే ఉంది. ఈ క్రమంలో ఆమె అపస్మారక స్థితి లోకి వెళ్లింది.

గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటీన చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే మార్గం మధ్యలోనే మంగమ్మ ప్రాణాలు వదిలింది. ఒకే ఇంట్లో.. ఒకే రోజున.. గంటల వ్యవధిలోనే అత్త కోడలు మృతి చెందడంతో ఆ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. అత్త, కోడళ్ళు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నయి.

Also read

Related posts

Share via