నగరంలో డేటింగ్ స్కాం వెలుగులోకి వచ్చింది. డేటింగ్ యాప్ లో పరిచయమవుతున్న యువతులు.. యువకులను హైటెక్ సిటీలో ఓ పబ్కి తీసుకెళ్తున్నారు.
హైదరాబాద్: నగరంలో డేటింగ్ స్కాం వెలుగులోకి వచ్చింది. డేటింగ్ యాప్లో పరిచయమవుతున్న యువతులు.. యువకులను హైటెక్ సిటీలోని ఓ పబ్కి తీసుకెళ్తున్నారు. అక్కడ ఖరీదైన మద్యం, ఇతర ఆహార పదార్థాలు ఆర్డర్ చేసి యువతులు జారుకుంటున్నారు. ఇప్పటి వరకూ 8 మంది బాధితులుగా మారినట్లు తెలుస్తోంది.
టిండర్, బంబుల్ వంటి డేటింగ్ యాప్లో పరిచయం అవుతున్న యువతులు.. వెంటనే వాట్సాప్ ద్వారా కలుద్దామని సందేశాలు పంపుతున్నారు. యువకులను మెట్రో స్టేషన్ పక్కనే ఉన్న పబ్లోకి తీసుకెళ్తున్నారు. గంటలో రూ.40 వేల వరకూ బిల్ చేసి జారుకుంటున్నారు. విషయం తెలుసుకునే లోపే బిల్ కట్టాలని యువకులపై పబ్ యాజమాన్యం ఒత్తిడి తెస్తోంది. పబ్ నిర్వాహకులు, యువతులు కలిసి ఈ స్కాంకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. తాము కూడా బాధితులమేనంటూ పలువురు ముందుకు వస్తున్నారు. అయితే.. దీనిపై ఇప్పటి వరకూ పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు.
Also read
- చిన్నారులను చంపి తండ్రి ఆత్మహత్య
- విజయవాడలో భారీగా స్టెరాయిడ్స్ పట్టివేత
- నరక యాతన పడి వ్యాన్ డ్రైవర్ మృతి
- గ్యాంగ్ రేప్ కేసు.. స్నేహితుడి పనే?! అరెస్ట్
- Andhra: స్టూడెంట్ బ్యాగ్లో లిక్కర్ బాటిల్.. కట్ చేస్తే, ఎంత ఘోరం జరిగిందో తెలుసా..?