SGSTV NEWS online
Andhra PradeshCrimeTelangana

cyber fraud: హెరిటేజ్ లోగోతో లింకులు.. సైబర్ మోసగాళ్ల కొత్త ఎత్తుగడ

హెరిటేజ్ గణతంత్ర దినోత్సవ బహుమతి రూ.50 వేలు
గెలుచుకున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వచ్చిన లింక్ కాకినాడ(గాంధీనగర్) సైబర్ మోసగాళ్లు కొత్త ఎత్తుగడలు వేస్తూ సామాన్యులకు వల విసురుతున్నారు. పండుగ ఆఫర్లు అంటూ ప్రముఖ కంపెనీల లోగోలతో సామాజిక మాధ్యమాల్లో లింకులు పంపిస్తున్నారు. వాటిపై క్లిక్ చేయగానే ఫోన్లోని డేటా లాగేస్తున్నారు. కాకినాడకు చెందిన కొందరికి శుక్రవారం అపరిచిత వ్యక్తుల నుంచి ఫోన్ పే లోగోతో లింక్లు వచ్చాయి. వాటిలో ‘మొదట నేను ఇది నకిలీ అనుకున్నా. కానీ నిజంగా నాకు రూ.5 వేలు వచ్చాయి. మీరు కూడా ప్రయత్నించి చూడండి’ అని ఉంది. ఆ లింక్ ఓపెన్ చేయగానే.. ఈ లింక్ను 5 గ్రూపులు, 15 మంది వ్యక్తులకు పంపితే మీ ఖాతాలో రూ.5 వేలు జమవుతాయని మెసేజ్ వచ్చింది. అది నమ్మిన కొందరు ఆ లింక్ను తెలిసిన వారికి పంపించారు. వాటిని ఓపెన్ చేసిన వారి ఫోన్లు హ్యాక్ అయినట్లు ఫిర్యాదులు వచ్చాయి.

Also read

Related posts