November 24, 2024
SGSTV NEWS
Crime

Cyber Crime: క్రైమ్ బ్రాంచ్ డీసీపీ అని బెదిరించి రూ.1.48 కోట్లకు టోకరా.. ఎక్కడంటే..?

డిజిటల్ యుగంలో సాంకేతికత వినియోగం చాలా పనులను సులభతరం చేసింది. అయితే నేరస్థులు తమ అక్రమాలకు కూడా ఈ టెక్నిక్‌లను ఉపయోగిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఇలాంటి ఉదంతం వెలుగులోకి చూసింది. సోషల్ మీడియా ద్వారా ఓ మహిళను రూ.1 కోటి 48 లక్షలు మోసం చేశారు నేరగాళ్లు. దుండగులు మహిళను మూడు రోజుల పాటు ఆమె ఇంట్లో డిజిటల్ గృహనిర్బంధంలో ఉంచారు.

పోలీసుల కథనం ప్రకారం.. ప్రయాగ్‌రాజ్‌లోని జార్జ్ టౌన్ ప్రాంతంలో కకోలి దాస్ అనే వృద్ధురాలు నివసిస్తున్నారు. ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్‌గా ఉన్న ఆమె భర్త చాలా ఏళ్ల క్రితం చనిపోయాడు. ఒక కుమార్తె ఉంది, ఆమె విదేశాలలో ఉంటుంది. కకోలి తన ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారు. ఏప్రిల్ 23న ఆమెకు ఓ నంబర్ నుంచి కాల్ వచ్చింది. కాల్ చేస్తున్న వ్యక్తి తనను తాను ముంబై క్రైమ్ బ్రాంచ్ డీసీపీగా పరిచయం చేసుకున్నాడు. ఆమెను నమ్మించేందుకు వీడియో కాల్ చేసి పోలీసు డ్రెస్ లో కనిపించాడు. తైవాన్ నుంచి మీ పేరు మీద పార్శిల్ వచ్చిందని, అందులో 200 గ్రాముల (MDMA) డ్రగ్, 3 క్రెడిట్ కార్డ్‌లు, 5 ల్యాప్‌టాప్‌లు ఉన్నాయని కకోలి దాస్‌కి చెప్పాడు. మేము మీ బ్యాంకు ఖాతాలను తనిఖీ చేయాలని, మీరు సహకరించాలని చెప్పాడు. ఆ తర్వాత మహిళ బ్యాంకు ఖాతాల వివరాలను తీసుకుని పత్రాలపై సంతకాలు చేశాడు. కొద్దిసేపటికే కకోలి దాస్ బ్యాంకు ఖాతాల నుంచి రూ.1 కోటి 48 లక్షలు మాయమయ్యాయి. విచారణ పూర్తయ్యే వరకు ఇంటి నుంచి బయటకు రావొద్దని సూచించడంతో ఆ వృద్ధురాలు మూడు రోజులుగా ఇంట్లోనే ఉండిపోయారు.

నాలుగు రోజుల తర్వాత, బాధితురాలు కాకోలి దాస్ మోసానికి గురైనట్లు గుర్తించి ప్రయాగ్‌రాజ్‌లోని జార్జ్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ ప్రారంభించి ఏ ఖాతాకు నగదు బదిలీ చేశారో తెలుసుకున్నారు. నలుగురు నిందితులను అరెస్టు చేశారు. ఈ సైబర్‌ దుండగులకు బ్యాంకాక్‌, థాయ్‌లాండ్‌, నేపాల్‌ దేశాలతో కూడా సంబంధాలు ఉన్నాయని పోలీసుల విచారణలో తేలింది. అరెస్టయిన వారిలో అమర్‌పాల్, మిథిలేష్ , కుమార్, రాజేష్ కుమార్ ఉన్నారు.

Also read





Related posts

Share via