July 3, 2024
SGSTV NEWS
CrimeTelangana

పెళ్లయ్యాక ఇదేం పాడు పని.. చివరికి ఇంత దారుణంగా?





Miryalaguda Crime News: ఈ మధ్య కాలంలో వివాహేతర సంబంధాలు పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతున్నాయి. భార్యాభర్తల మద్య విభేదాలు వివాహేతర సంబంధాలకు దారి తీస్తున్నాయని అంటున్నారు.

ఈ మధ్య కాలంలో చాలా మంది ప్రతి చిన్న విషయానికే తీవ్ర మనస్థాపానికి గురై దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. చాలా వరకు పని ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలతో పాటు వివాహేతర సంబంధాల వల్ల భార్యాభర్తల మధ్య విభేదాలు రావడం చూస్తున్నాం. అక్రమ సంబంధాల నేపథ్యంలో భార్యాభర్తలు ఒకరినొకరు చంపుకుంటున్నారు. అయితే ఏదైనా సమస్యలు వస్తే సన్నిహితులు, బంధువులతో తమ బాధ చెప్పుకుంటే కొంత తీరుతుందని చెబుతున్నారు మానసిక నిపుణులు. అక్రమ సంబంధాలు పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతున్నాయి. పెళ్లైన భర్తను వీడి మరో యువకుడితో ఎఫైర్ నడిపింది. చివరికి దారుణమైన నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే..


నల్లగొండ జిల్లా మిర్యాలగూడ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. మిర్యాలగూడ రైల్వే స్టేషన్ పరిధిలో కుక్కడం మధ్య ఉన్న ఐలాపురం రైల్వే ట్రాక్ పై వివాహిత, యువకుడు కలిసి గూడ్స్ రైల్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. మిర్యాలగూడ మండలం వెంటకటాద్రిపాలెం పరిధిలో దుర్గా నగర్ కి చెందిన ఆర్ ధనలక్ష్మి (22) , జి దుర్గా ప్రసాద్ (19) లు గురువారం ఉదయం గూడ్స్ ట్రైన్ ఎదురుగా వెళ్లి బలవన్మరాణానికి పాల్పపడ్డారు. దీంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

గత కొంత కాలంగా ధనలక్ష్మి-దుర్గా ప్రసాద్ మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతుంది. ఈ విషయం తెలుసుకొని ధనలక్ష్మి భర్త గట్టిగా మందలించాడు. దీంతో మనస్థాపం చెందిన ధనలక్ష్మి మూడు రోజుల క్రితం భర్తను వదిలి పుట్టింటికి వచ్చింది. ఈ క్రమంలోనే ధనలక్ష్మి- దుర్గా ప్రసాద్ తాము కలిసి బతకలేమని.. కలిసి చనిపోదాం అని ఆత్మహత్య చేసుకున్నారు. ధనలక్ష్మి కనిపించడం లేదని భర్త రవికాంత్ మిర్యాలగూడ పోలీస్ స్టేషన్ లో బుధవారం ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే ఐలాపురం రైల్వే ట్రాక్ వద్ద ఇద్దరుమృత దేహాల లభ్యమయ్యాయి. మృతురాలికి భార్గవ్, భవాని పిల్లలు ఉన్నారు. ఒకే ఊరిలో రెండు విషాదాలు జరగడంతో రోదనలు మన్నంటాయి.

Also read

Related posts

Share via