April 23, 2025
SGSTV NEWS
CrimeUttar Pradesh

Crime: భర్త పెళ్లికి రాలేదని భార్య ఆత్మహత్య.. ఆ తర్వాత అతను మరీ ఘోరంగా!


ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. బిజ్నోర్‌ జిల్లా కాకరాలలో పెళ్లికి వెళ్లే విషయంలో యువదంపతులు సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది. భర్త రోహిత్‌ మద్యం సేవించి ఆలస్యంగా ఇంటికి రావడంతో పార్వతి సూసైడ్ చేసుకుంది. తర్వాత రోహిత్ ట్రైన్ కిందపడి చనిపోయడు.

Crime: ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. క్షణికావేశం ఇద్దరి దంపతుల ప్రాణాలు తీసింది. కొత్తగా పెళ్లైన జంట పట్టుమని 5 ఏళ్లు కూడా గడపకుండానే తనువు చాలించింది. పెళ్లికి వెళ్దామని చెప్పి రెడీ అయిన భార్య.. భర్త రాకకోసం ఆతృతగా ఎదురుచూస్తోంది. ఈ క్రమంలోనే అతను మద్యం సేవించి ఇంటికి రావడంతో తీవ్ర మనస్తాపానికిగురైంది. దీంతో ఇద్దరి మధ్య వివాదం చోటుచేసుకోగా మాటా మాటా పెరిగింది. అంతే ఆవేశంలో భార్య ఆత్మహత్య చేసుకోగా ఆ తర్వాత అతను కూడా రైలు కిందపడి చనిపోయాడు. వివరాలు ఇలా ఉన్నాయి. 

బంధువుల పెళ్లికి వెళ్లేందుకు..
ఈ మేరకు మృతుల బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిజ్నోర్‌ జిల్లా కాకరాల గ్రామంలో ఈ ఘటన జరిగింది. బంధువుల పెళ్లికి వెళ్లేందుకు రెడీ కావాలని గురువారం రాత్రి భర్త రోహిత్‌ (26)కు పార్వతి (24) చెప్పింది. అయితే ఇదంతా పెద్దగా పట్టించుకోగా రోహిత్‌ మద్యం తాగి ఇంటికి వచ్చాడు. అప్పటికే ఆలస్యం కావడంతో విసిగిపోయిన పార్వతి.. అతనితో గొడవపడింది. ఇద్దరి మధ్య మాటలతూటాలు పెలాయి.

దీంతో అవమానంగా భావించిన పార్వతి.. ఇంట్లోనే ఉరేసుకుని చనిపోయింది. భార్య చనిపోయిన విషయాన్ని గుర్తించిన రోహిత్‌.. భయంతో బయటకు పరుగులు తీశాడు. ఇంటికి దగ్గరలోని రైల్వే ట్రాక్ మీదకు వెళ్లి ట్రైన్ వస్తుండగానే తలపెట్టి చనిపోయాడు. మృతదేహాలను పోర్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also read

Related posts

Share via