విచ్చలవిడిగా సాగుతున్న గంజాయి వినియోగంపై కొరడా ఝులిపించారు పోలీసులు. మైనర్లను గంజాయి మత్తులోకి దింపి అఘాయిత్యాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను జగిత్యాల పోలీసులు అరెస్ట్ చేశారు. స్కూలుకు వెళ్ళే మైనర్ అమ్మాయిలను ట్రాప్ చేసి గంజాయి మత్తులో దింపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అమ్మాయిలకు గంజాయి ఎరగా వేసి వారిని లోబర్చుకుంటున్న వారిని అరెస్ట్ చేశారు.
జగిత్యాల టౌన్‌లోని పద్మానగర్‌కు చెందిన ప్రేమ్, వెంకటేష్, నితిన్‌లను అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఫోక్సో కేసుతో పాటు ఎన్టీపీసీ యాక్ట్ కేసు నమోదు చేశారు. పెళ్లి చేసుకుంటానని మైనర్లను మచ్చిక చేసుకుని వారికి గంజాయి అలవాటు చేసి వారిపై అత్యాచారానికి పాల్పుడుతన్నారని పోలీసులు తెలిపారు. ఏడాది కాలంగా గంజాయికి అడిక్ట్ అయిన ఆ యవకులు ముగ్గురు కూడా మైనర్ బాలికలపై పలుమార్లు దారుణానికి ఒడిగట్టారని పోలీసులు వెల్లడించారు.
పేదలే టార్గెట్..?
ఈ రొంపిలోకి దింపేందుకు యువకులు పేద కుటుంబాలకు చెందిన మైనర్లనే ఎంచుకున్నట్టుగా స్పష్టం అవుతోందని పోలీసులు తెలిపారు. ఆర్థిక పరిస్థితులు అంతగా లేని కుటుంబాలకు చెందిన వారు అయితే ఈజీగా తమ ట్రాప్ లో పడుతారన్న ఆలోచనతోనే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారన్న పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గంజాయికి అడిక్ట్ అయిన చిన్నారులు ఆ మత్తు నుండి బయటపడలేక దాని కోసం వెతకాల్సిన స్థితి చేరిపోయారు. దీనికి అలవాటు పడిన వారంతా కూడా తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్న ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే పోలీసుల ప్రత్యేక నిఘా పెట్టారు. గంజాయి దందాపై కూపీ లాగుతున్నారు. జగిత్యాల పట్టణంలో చాపకింద నీరులా సాగుతున్న గంజాయి దందాపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తుండడంతో రోజుకో ముఠా గురించి వెలుగులోకి వస్తోంది.
Also read
- ఆ తల్లికి ఎంత కష్టమొచ్చింది.. మృతదేహంతో స్మశానంలో జాగారం..!
- Hyderabad: సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్యపై కత్తితో దాడికి యత్నం
- Andhra: చవితి వేళ పాలు పోసేందుకు పుట్ట వద్దకు భక్తులు.. ఆ తర్వాత అసలు ట్విస్ట్..
- ఆ ఆలయంలో పూజ చేస్తే అపమృత్యు దోషం దూరం! ఎక్కడుందంటే?
- నేటి జాతకములు….25 అక్టోబర్, 2025




