మనిషి క్షణికావేశం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. కర్రీ పాయింట్‌కు వెళ్లి పప్పు తీసుకురాలేదని కోపంతో సొంత అన్న కొడుకును కాటికి పంపించాడు ఓ దుర్మార్గుడు.. ఈ ఘటన కడప జిల్లాలోని పులివెందుల నియోజకవర్గం నగరిగుట్టలో చోటుచేసుకుంది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు
కన్న కొడుకు రెడ్డి బాబును కర్రీ పాయింట్‌కి వెళ్లి పప్పు తీసుకుని రమ్మని చిన్నాన్న చెప్పాడు. అందుకు బాబు నిరాకరించాడు. దీంతో ఎదురు సమాధానం చెప్పాడని ఆగ్రహానికి లోనైనా చిన్న మల్లికార్జున అన్న కొడుకు రెడ్డి బాబుపై చేయి చేసుకున్నా.డు అయితే కొట్టే దెబ్బలు గట్టిగా తగలడంతో అక్కడికక్కడే రెడ్డి బాబు కుప్పకూలిపోయాడు. అయితే ఈ విషయాన్ని బయటకు చెప్పకుండా అన్న కొడుకును ఇంట్లోనే సంచిలో కట్టి మూలన పెట్టాడు మల్లికార్జున.
ఇదిలావుంటే ఇంటి నుంచి బయటకు వెళ్ళిన రెడ్డి బాబు ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు చుట్టుపక్కల ఇళ్ళల్లో వెతికారు. చివరికి ఇంటి లోపల మూలన గోనె సంచిలో పెట్టిన ఒక మూట కనపడటంతో అనుమానం వచ్చిన స్థానికులు తల్లిదండ్రులు తెరిచి చూడగా రెడ్డి బాబు విగతజీవిగా కనిపించాడు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటీన బాబును స్థానిక పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళగా, అప్పటికే చనిపోయాడని డాక్టర్లు నిర్ధారించినట్లు స్థానికులు తెలిపారు. అన్యం పున్యం ఎరుగని పసివాడు బలికావడం పట్ల స్థానికంగా తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.
అయితే క్షణికావేశంలో చేశాడా లేదా కావాలనే చేశాడా అనే దానిపై పోలీసులు విచారిస్తున్నారు. 9వ తరగతి చదువుతున్న రెడ్డి బాబు ఆకస్మాత్తుగా ఇలా చనిపోవడంపై స్థానికులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Also read
- నేటి జాతకములు 22 నవంబర్, 2024
- తెలంగాణ : అయ్యో..పాపం..వీళ్లు బంధువాలా.. రాబందువులా?.. ఆస్తిని కాజేసి చివరికి..
- ఈ ఆంజనేయ స్వామి కొండ ఎక్కితే.. పచ్చగా మారుతున్న భక్తులు
- చెల్లి ఫొటోతో ఎఫ్బీ అకౌంట్..యువకుడి నుంచి కోట్లువసూలు, ట్విస్ట్ సూపర్
- అమ్మాయితో మాట్లాడాడని ఇంటర్ విద్యార్థిపై దాష్టీకం కోనసీమలో నలుగురు యువకుల దౌర్జన్యం