SGSTV NEWS
CrimeNational

లాడ్జ్‌లోని ఒకే గదిలో ఓ యువకుడు, ముగ్గురు పిల్లల తల్లి మృతి! మతిపోయే నిజాలు..



బెంగళూరులోని యెలహంకలో లాడ్జ్ అగ్నిప్రమాదం వెనుక అసలు నిజాలు బయటపడ్డాయి. రమేష్, కావేరి అనే ఇద్దరు మృతి చెందగా, వారిది అక్రమ సంబంధం. పెళ్లి ఒత్తిడితో రమేష్ తనపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఈ అగ్నిప్రమాదం కారణంగా కావేరి పొగకు ఊపిరి ఆడక బాత్‌రూమ్‌లో చనిపోయింది.

బెంగళూరులోని యెలహంక న్యూ టౌన్‌లో కూల్ కంఫర్ట్ అనే చిన్న లాడ్జ్‌లో ఆదివారం సాయంత్రం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే ఆ లాడ్జ్‌ ఓనర్‌ ఫైర్‌ స్టేషన్‌కు ఫోన్‌ చేయడంతో ఫైర్‌ ఇంజన్లు వచ్చి మంటలు ఆర్పాయి. అయితే ఈ ప్రమాదంతో లాడ్జ్‌లోని ఓ గదిలో ఇద్దరు మృతి చెందారు. ఒక యువకుడు పూర్తిగా కాలిపోయి మరణిస్తే.. అదే గదిలోని బాత్‌రూమ్‌లో ఊపిరి ఆడక ఓ మహిళ మృతి చెందింది. మృతులను రమేష్‌, కావేరిగా గుర్తించారు పోలీసులు. అయితే ఇక్కడ అసలు ట్విస్ట్‌ ఏంటంటే..? వాళ్లిద్దరూ భార్య భర్తలు కాదు, అగ్ని ప్రమాదం కారణంగా రమేష్‌ చనిపోలేదు.. అతని చావుతోనే అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అది ఎలాగంటే..

అప్పటికే కావేరికి పెళ్లి అయి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆమె ఓ స్పా సెంటర్‌లో పనిచేస్తోంది. ఈ క్రమంలోనే ఆమెకు రమేష్‌తో పరిచయం అయింది. ఆ పరిచయం కాస్త డీప్‌గా వెళ్లింది. దీంతో తనను పెళ్లి చేసుకోవాలని రమేష్‌, కావేరిపై ఒత్తిడి తెస్తున్నాడు. లేదు.. నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు, నీతో పెళ్లి కుదురదంటూ కావేరి, రమేష్‌ను దూరం పెట్టింది. ఈ వివాదం గురించి మాట్లాడుకోవడానికే ఈ ఇద్దరు లాడ్జ్‌లోని ఓ గది తీసుకున్నారు. పెళ్లి గురించి వీరిద్ధరి మధ్య వివాదం తీవ్రం అవుతున్న క్రమంలోనే అక్కడికి కావేరి మామ కొడుకు వచ్చాడు. వీళ్ల విషయం అతనికి ముందే తెలుసు. అయితే రమేష్‌ అప్పటికే తనతో పాటు లీటర్‌ పెట్రోల్‌ తెచ్చుకుని పెట్టుకున్నాడు.

కావేరిపై కోపం ఆ పెట్రోల్‌ తనపై వేసుకొని నిప్పు అంటించుకున్నాడు. అప్పుడే వచ్చి ఈ సీన్‌ చూసిన కావేరి మామ కొడుకు ప్రశాంత్‌ వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. కానీ కావేరి మాత్రం భయంతో ఆ గదిలోని బాత్‌రూమ్‌లోకి వెళ్లింది. రమేష్‌ శరీరానికి అంటుకున్న మంటలు గది మొత్తం వ్యాపించాయి. దాంతో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆ మంట కారణంగా వచ్చిన పొగ మొత్తం గదిలో నిడిపోవడం, బాత్‌రూమ్‌లో కూడా నిండిపోవడంతో కావేరి ఊపిరి ఆడక చనిపోయింది. అయితే అగ్ని ప్రమాదం జరిగే ముందు ఆ గదిలో వారిద్దరితో పాటు ప్రశాంత్‌ కూడా ఉన్నాడనే విషయాన్ని గుర్తించి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తే ఈ మ్యాటర్‌ అంతా బయటపడింది.

Also read

Related posts