April 19, 2025
SGSTV NEWS
Crime

CRIME NEWS: ‘నాన్న క్షమించండి.. మీ కలల్ని నెరవేర్చలేకపోయా’: జేఈఈ విద్యార్థిని సూసైడ్‌!


జేఈఈ(మెయిన్‌)తొలి విడత పరీక్షఫలితాల్లో ఫెయిలైనందుకు ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. తక్కువస్కోరు వచ్చిందని మనస్తాపంతో 18ఏళ్ల విద్యార్థిని హాస్టల్‌లో ఉరివేసుకొని ప్రాణాలు తీసుకుంది. కన్నవారి కలల్ని నెరవేర్చలేకపోయినందుకు క్షమించాలంటూ సూసైడ్‌నోట్ రాసింది.

ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డలు బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని.. మంచి ఉద్యోగం సాధించాలని కలలుకంటారు. దానికి అనుగుణంగానే తమ బిడ్డల చదువు కోసం చిన్నప్పటి నుంచే లక్షలు ఖర్చు చేస్తారు. ఇక వారు కూడా మంచి ఉద్యోగం సాధించి తల్లి దండ్రుల కలను నేరవేర్చుదాం అని కృషి పట్టుదలతో చదువుతారు

అయితే అలా చదువును కొనసాగించిన ఓ విద్యార్థిని తాజాగా సూసైడ్ చేసుకుంది. ఇటీవల విడుదలైన JEE (మెయిన్) మొదటి విడత పరీక్ష ఫలితాల్లో విఫలమైంది. దీంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. కన్నవారి కలల్ని నెరవేర్చలేకపోయినందుకు తనలో తానే కుమిలిపోయింది. ఏం చేయాలో తెలియక ఊహించని నిర్ణయం తీసుకుంది. ఈ విషాదకర ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఉరివేసుకుని ఆత్మహత్య
గోరఖ్‌పూర్‌లోని సంత్ కబీర్ నగర్ జిల్లాకు చెందిన 18 ఏళ్ల బాలిక ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటూ అక్కడే కోచింగ్ తీసుకుంటోంది. ఇటీవల జేఈఈ (మెయిన్) తొలి విడత పరీక్ష రాసింది. కానీ ఫలితాల్లో విఫలమైంది. దీంతో ఆ బాలిక తక్కువ స్కోర్ వచ్చిందన్న నిరాశతో హాస్టల్‌లో ఉరేసుకుని బలవన్మరనానికి పాల్పడింది

ఇక విషయం తెలిసి పోలీసులు అక్కడకు చేరుకోగా..మృతదేహం పక్కన ఒక సూసైడ్ లెటర్‌ను గుర్తించారు. అందులో అమ్మా, నాన్న నన్ను క్షమించండి.. నేను సాధించలేకపోయాను అని తెలిపింది. ఇక్కడితో మన ప్రయాణం పూర్తయింది. నేను లేనని కన్నీరు పెట్టుకోవద్దని.. మీరిద్దరూ నన్నెంతగానో ప్రేమగా చూసుకున్నారని పేర్కొంది. మీ కలల్ని నేను నిజం చేయలేకపోయానంటూ అందులో రాసింది. ఆ బాలిక మృతితో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.

Also read

Related posts

Share via