పెళ్లి కావడం లేదన్న మనస్తాపంతో జోగిపేట సమీపంలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తండ్రి మాటలకు నొచ్చుకున్న అతను క్షణికావేశంలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పూర్తి వివరాలు కథనం లోపల …
ముప్పై ఏళ్ళు వచ్చిన పెళ్లి కావడం లేదన్న మనస్తాపంతో ఓ యువకుడు నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగించాడు. తండ్రి అన్న మాటలకు నొచ్చుకొని క్షణికావేశంలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే పెళ్లి ముచ్చట ఆ యువకుడి ప్రాణం తీసింది. పండగలా పెళ్లి జరగాల్సిన ఇంట్లో విషాద ఛాయలు నింపింది. వివరాల్లోకి వెళ్తే.. జోగిపేట మండల పరిధిలోని చిట్కుల్ గ్రామానికి చెందిన తుపాకి అశోక్‌కి 30 ఏళ్లు. అయితే గత కొంతకాలంగా అతను పెళ్లి కోసం తపించిపోతున్నాడు. తనకు త్వరగా పెళ్లి సంబంధం చూడాలని,నెల రోజుల్లోనే పెళ్లి చేయాలని తన తండ్రి రాములును కోరాడు. అయితే నెల రోజుల్లో సంబంధం కుదిర్చి పెళ్లి చేయడం సాధ్యమవుతుందో లేదో అని తండ్రి బదులిచ్చాడు. దీంతో తండ్రి అన్న మాటలకు తీవ్ర మనస్థాపానికి గురైన అశోక్.. క్షణికావేశంలో తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. తన ఇంట్లో ఉన్న ఇనుప పైపుకు నూలు తాడుతో ఉరివేసుకున్నాడు. కిటికీలోంచి గమనించిన పక్కింటి వారు కేకలు వేయడంతో, కుటుంబ సభ్యులు తలుపులు పగులగొట్టి అశోక్‌ను కిందికి దించారు. హుటాహుటిన జోగిపేట ఆసుపత్రికి తరలించారు. కానీ, అప్పటికే అశోక్ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
Also read
- ఆసుపత్రిలో గుట్టుచప్పుడు కాకుండా యవ్వారం.. అధికారుల తనిఖీలో బయటపడ్డ సంచలనాలు!
- అప్పుల బాధతో కన్న పిల్లలకు విష గుళికలు ఇచ్చి..
- లక్ష్మీ నారాయణ యోగం.. వీరికి పట్టింది బంగారమే
- ఆరుద్ర నక్షత్రంలోకి సూర్యడు.. ఈ మూడు రాశుల దశ తిరగడం ఖాయం!
- Pushkaralu: పన్నెండేళ్ల పుష్కరాల రహస్యం.. ద్వాదశ రాశులు, 12 నదుల మధ్య ఉన్న సంబంధం ఇదే!





