దసరా పండుగ వేళ జనగామ జిల్లాలో మేకల చోరీ కలకలం రేపింది. పాలకుర్తి మండలం గుడూరు గ్రామం సమీపంలో మేకలను మేపుతున్న నాయిని రవి భోజనానికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఒక పొట్టేలుతో పాటు ఐదు మేకలు కనిపించకుండా పోయాయి. వీటి విలువ సుమారు రూ.1.50 లక్షలు ఉంటుందని బాధితుడు తెలిపాడు. ఫిర్యాదు, సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
దసరా పండుగ అంటేనే చుక్కా ముక్కా.. దసరా రోజు మటన్కు ఫుల్ డిమాండ్ ఉండడంతో కొందరు దొంగలు మేకలను దొంగిలించి అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. జనగామ జిల్లాలో మేకలను దొంగిలించిన ఓ ముఠా పోలీసులకు చిక్కింది.. చాకచక్యంగా ఆ మేకలను దొంగిలించి అమ్ముకున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే.. యాట మాంసం ధరలు అమాంతం పెరిగిపోయాయి.. పండుగ పూట పొట్టేళ్లకు ఫుల్ డిమాండ్ పెరిగింది.. మటన్ ధర వెయ్యి రూపాయలకు చేరింది.. దీంతో దొంగలు రూటు మార్చారు.. ఈజీగా డబ్బు సంపాదించడం కోసం గొర్రెలు, మేకలను దొంగిలించి అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు..
తాజాగా జనగామ జిల్లా పాలకుర్తి మండలం గుడూరు గ్రామం వద్ద మేకల దొంగలు కలకలం సృష్టించారు. గ్రామ చెరువు కట్ట వద్ద మేకలను మేపేందుకు తీసుకెళ్లిన మేకల కాపరి రవి అనే వ్యక్తికి గుర్తుతెలియని వ్యక్తులు ఊహించని షాకిచ్చారు.. భోజనం చేసి తిరిగి వచ్చేసరికి ఒక పొట్టేలుతో పాటు ఐదు మేకలును దొంగలించారు.
మేకల దొంగతనానికి నిందితులు వాడిన బైక్ సంబంధించిన వీడియోలన్నీ పక్కనే ఉన్న ఓ రైస్ మిల్లు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. బాధితుడు నాయిని రవి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేశారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాలో రికార్డ్ అయిన పుటెజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.. దసరా పండుగ కోసం మేకల దొంగతనానికి పాల్పడినట్లు బాధితుడు ఆరోపించాడు.
బాధితుని పిర్యాదుతో పోలీసులు కొద్ది గంటల్లోనే ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. చోరీకి గురైన మేకల విలువ సుమారు రూ.1 లక్ష 50 వేల రూపాయలు ఉంటుందని బాధితుడు తెలిపారు. దసరా పర్వదినాన్ని సొమ్ము చేసుకోవడం కోసం ఇలాంటి దొంగతనంలో పాల్పడుతున్న నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.
Also read
- నెంబర్ ప్లేట్ స్థానంలో ‘ఘోస్ట్’ కారుతో పోలీసులపైకే!
- మూత్రం పోస్తుందని మూడేళ్ల కూతురిని కడతేర్చిన తల్లి!
- ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక సూటి ప్రశ్న..?!*
- Dussehra: దసరా రోజున ఈ పనులు అస్సలు చేయకూడదట! దశమి నాడు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలివే!
- రావణ సంహారానికి ముందు శ్రీరాముడు ఈ దేవతను ఎందుకు పూజించాడు? దసరా వెనుక ఉన్న పురాణ గాథ ఇదే!





