హైదరాబాద్ మాదాపూర్‌లో తీవ్ర విషాదం వెలుగు చూసింది. ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని తాను ఉంటున్న హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ప్రాణాలు కోల్పోయింది. హాస్పల్ సిబ్బంది సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాదీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని అనుమానాస్పద స్థితిలో మరణించిన ఘటన మాదాపూర్ పరిధిలోని చంద్ర నాయక్ తండాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లా మీరన్‌పూర్ ప్రాంతం సిఖ్రేడా గ్రామానికి చెందిన అర్చనా చౌదరి మాలిక్ (29) హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఉంటూ మైండ్‌స్పేస్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. అయితే ఏం జరిగిందో తెలియదు కాని.. శనివరాం రాత్రి ఆమె ఉంటున్న హాస్టల్‌లోని గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకున్న స్థితిలో కనిపించింది.
తన గదిలో ఫ్యాన్‌కు వేలాడుతున్న అర్చనను చూసిన హస్టల్ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్ట్‌మార్టం నిమిత్తం మార్చరీకి తరలించారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆమె మరణానికి గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తును ముమ్మరం చేశారు.
Also read
- Hyderabad: ఫోటో చూసి అమాయకుడు అనుకోవద్దు.. ఇతని క్రైమ్ హిస్టరి తెలిస్తే..
- Hyderabad: 35కు పైగా కేసుల్లో నిందితుడు.. పరారీలో ఉన్న రౌడీషీటర్ అరెస్ట్
- బార్లో రివాల్వర్‌తో హల్చల్.. బిల్లు డబ్బులు ఇవ్వకపోతే కాల్చేస్తానంటూ..
- హైదరాబాద్ పాతబస్తీలో ఉద్రిక్తత – మాతా విగ్రహ ఊరేగింపుపై కోడిగుడ్లతో దాడి
- Kolhapur Gold Theft:మామ ఇంటో బంగారం చోరీ చేసి థార్ కొనుగోలు.. కారు పూజకు మామే చీఫ్ గెస్ట్!





