పాపన్నపేట, మంజీరా నదిలో స్నానానికి వెళ్లిన ఐదుగురు ప్రమాదవశాత్తు నీటిలో మునగగా.. ఇద్దరు మృతి చెందారు. ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పొడ్చన్‌పల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్ గౌడ్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పొడ్చన్‌పల్లి గ్రామానికి చెందిన కంబాల కపిల్, స్వప్న దంపతులకు ముగ్గురు కుమార్తెలు. రెండో కూతురు స్ఫూర్తి (16) రామక్కపేటలోని గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. రెండు రోజుల క్రితం స్వప్న సోదరి అయిన అదే మండలం చీకోడ్ గ్రామానికి చెందిన దోగూరి మంజుల(30)తో పాటు మరికొంత మంది బంధువులు పొడ్చన్‌పల్లికి వచ్చారు.
శుక్రవారం మధ్యాహ్నం గ్రామ శివారులోని మంజీరా నది సమీపంలో ఉన్న కపిల్ పొలం వద్దకు అందరూ కలిసి వెళ్లారు. కపిల్ పొలం వద్ద పనిలో ఉండగా మిగతా వారు సమీపంలోని మంజీరా నది చెక్ డ్యాం వద్దకు చేరుకున్నారు. నదిలోకి దిగి స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు నీటిలోకి జారిపోయిన మంజుల, కపిల్ భార్య స్వప్న, కుమార్తెలు స్పూర్తి, శ్రుతి, వరుసకు కోడలు అయిన శివానీలు నీటిలో మునిగిపోతూ.. కేకలు వేశారు. అరుపులు విన్న కపిల్.. వెంటనే అప్రమత్తమై నీటిలో మునిగిపోతున్న భార్య స్వప్న, పెద్దకుమార్తె శ్రుతి, కోడలు శివానీని రక్షించారు.
అప్పటికే మంజుల, రెండో కుమార్తె స్పూర్తి నీటిలో మునిగి గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు గజ ఈతగాళ్లతో నదిలో గాలింపు చేపట్టి… ఇద్దరి మృతదేహాలను వెలికి తీయించారు.
Also read
- మద్యం సేవించి యువతి ఇంటికి వెళ్లిన యువకుడు.. కొద్దిసేపటికే తీరని విషాదం..!
- రాత్రి బాగానే ఉంది.. తెల్లారేసరికి కత్తిరించి ఉంది.. హాస్టల్లో అమ్మాయిల జడలు కత్తిరిస్తున్నదెవరు?
- యువకుడి ప్రాణాలు బలిగొన్న ఇయర్ ఫోన్
- 8 నెలల పసి బిడ్డను చంపి తల్లి మృతి!.. సూసైడ్ నోట్లో సంచలన విషయాలు! అసలు ఏం జరిగింది?
- చదువుల గుడిలో వేధింపుల కలకలం.. విద్యార్థినులతో అసభ్య ప్రవర్తన.. కట్‌చేస్తే..





