SGSTV NEWS
CrimeTelangana

Telangana: సినిమా లెవెల్‌ స్కెచ్‌.. బెడిసికొట్టిన మాస్టర్‌ ప్లాన్.. ఇన్స్యూరెన్స్‌ డబ్బుల కోసం..



రోజురోజుకూ మానవ సంబంధాలు డబ్బుకు దాసోహం అయ్యాయి. కొందరు వ్యక్తులు డబ్బు కోసం ఏం చేయడానికైనా వెనకాడట్లేదు. డబ్బు పిచ్చితో వావివరసలు ,రక్త సంబంధాలు మరిచి మరీ ప్రవర్తిస్తున్నారు. ఈజీ మనీ కోసం తన అనుకున్న వారినే కడతేర్చి కటకటాల పాలవుతున్నారు. తాజాగా సిద్ధిపేట జిల్లాలోనే ఇదే తరహా సంఘటన వెలుగు చూసింది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఓ వ్యక్తి తన అత్తను సుపారీ గ్యాంగ్‌తో హత్యచేయించి కటకటాల పాలయ్యాడు.


సిద్దిపేట జిల్లా తోగుట మండలం పెద్దమసాన్ పల్లి కి చెందిన తాళ్ళ వెంకటేష్ అనే వ్యక్తి వ్యాపారం చేసి దాదాపు రూ. 22 లక్షలు నష్టపోయాడు. ఈ అప్పుల ఊబిలోంచి ఎలాగైన బయటపడాలనుకున్న వెంకటేష్‌కు ఓ దుర్మార్గమైన ఆలోచన వచ్చింది. తన అత్తపేరుపై ఇన్సూరెన్స్ చేయించి ఆమెను చంపాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా తన అత్తమ్మ తాటికొండ రామవ్వ పేరిట స్థానిక పోస్ట్ ఆఫీస్‌, SBI బ్యాంకులో ఇన్సూరెన్స్ చేయించాడు. అలాగే రైతు బంధు 5 లక్షల వరకు వస్తుందని, తెలుసుకుని తన పేరుపై ఉన్న 28 గుంటల భూమిని సైతం అత్త రామవ్వ పేరుపై చేయించాడు.


ఇక తను అనుకున్న ప్లాన్‌ను ఆచరణలో పెట్టడానికి ప్రయత్నాలు మొదలు పెట్టాడు. కానీ ఇది తన ఒక్కడి వల్ల కాదని తెలుసుకొని, తనకు లక్ష ముప్పై వేలు అప్పు ఇవ్వాల్సిన కరుణాకర్ సహాయం తీసుకున్నాడు. తను చెప్పినట్టుగా చేస్తే అప్పు డబ్బులు మాఫీ చేయడమే కాక ఇంకా డబ్బులు ఇస్తానని చెప్పడంతో కరుణాకర్ సైతం ఇందుకు అంగీకరించాడు. ఏదైనా వెహికల్‌తో తన అత్తమ్మను గుద్ది చంపేసి. ప్రమాదవశాస్తూ రోడ్డు ప్రమాదంలో మరణించినట్టు నమ్మించి ఇన్సూరెన్స్ డబ్బులు మొత్తం తీసుకుందామని ఒక పదకం వేశారు. తన అత్తమ్మని కారుతో గుద్ది చంపితే తాను ఇవ్వవలసిన రూ. 1,30,000/- ఇవ్వనవసరం లేదని, ఇన్సూరెన్స్‌ డబ్బులు వచ్చాక వాటిని చెరి సమానం పంచుకుంటామని వెంకట్‌ కరుణాకర్‌కు చెప్పి ఒప్పించాడు.

అనుకున్న ప్రకారం తన అత్త రమావ్వను పెద్దమాసన్ పల్లికి తీసుకొని వస్తాను, ఆమెను చంపడానికి వెహికల్ తీసుకొని తుక్కపూరీకి రమ్మని కర్ణాకర్‌కి వెంకట్‌ చెప్పాడు. దీంతో కర్ణాకర్ సిద్దిపేటలోని ఓ రెంటెండ్‌ కార్స్‌ దగ్గరకు వెళ్లి అక్కడ TS 18 0 2277 నెంబర్‌ గల థార్ కారును రెంట్‌కు తీసుకొని వచ్చాడు. పోలీసుల దృష్టి మళ్లించేందుకు ఆ కారు నెంబర్‌పై TH నెంబర్ గల స్టిక్కర్ అతికించి తుక్కాపూర్ గ్రామానికి కొద్ది దూరంలో ఆగినాడు. పది నిమిషాల తరువాత తాళ్ల వెంకటేష్ ఫోన్ చేయడంతో రోడ్డు పక్కనే ఉన్న రామవ్వను తార్ వాహనంతో గుద్ది పారిపోయాడు. దీంతో అక్కడికి చేరుకున్న వెంకటేష్‌ తన అత్త చనిపోయిందని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇన్సూరెన్స్‌ డబ్బుల కోసం వెంకటేష్‌ ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా వెంకటేష్ నేరం ఒప్పుకోవడంతో అతన్ని రిమాండ్‌కు తరలించారు.

Also read

Related posts

Share this