సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. అత్తింటి వేధింపులు భరించలేక నవ వధువు ఆత్మహత్య చేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగిన వివాహిత హాస్పిటల్లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అత్తింటి వేధింపులు భరించలేక పెళ్లై మూడు నెలలకే నవ వధువు పురుగుల మందు సేవించి ఆత్మహత్య కు పాల్పడ్డ సంఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో చోటు చేసుకుంది. బాధితురాలి తల్లిదండ్రుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్మార్టం నిమిత్తం హాస్పిటల్కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గజ్వేల్ ఏసీపీ నర్సింహులు తెలిపిన వివరాల ప్రకారం.. గజ్వేల్ పట్టణానికి చెందిన కండెల రోహిత్ కు, వసంత (21)తో గత మూడు నెలల క్రితం వివాహం జరిగిందని, అయితే పెళ్లి జరిగిన నెల వరకు భార్య భర్తలు ఇద్దరు మంచిగా ఉన్నారు. కానీ ఇటీవలే భర్త రోహిత్ అతని తల్లి తండ్రులు కలిసి వసంతను వేదింపులకు గురి చేసినట్టు పోలీసులు తెలిపారు. దీంతో వీళ్ళ వేదింపులు భరించలేక వసంత ఈ నెల ఒకటో తేదీన పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడగా చికిత్స పొందుతూ ఈ రోజు మృతి చెందిందని ఏసీపీ తెలిపారు.
మరోవైపు వసంత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ తన కూతురు మృతికి అత్తింటి వేధింపులే కారణమని , అదనపు కట్నం కోసం వసంతను వేధించడంతోనే ఆత్మహత్యకు పాల్పడిందని ఆరోపించారు. తన కూతురి మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని వసంత కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు
Also Read
- Telangana: మీరేం మనుషులురా.. మూగజీవాలకు విషం పెట్టి.. దారుణంగా..
- Telangana: కాళ్ల పారాణి ఆరకముందే.. కాటికెళ్లిన నవ వధువు.. పాపం ఎంత కష్టమొచ్చిందో!
- మోస్ట్ వాంటెడ్ రౌడీషీటర్ సురేందర్ అరెస్ట్.. దర్యాప్తులో సంచలనాలు
- Hyderabad: పీజీ డాక్టర్.. ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టాడు.. సీన్ కట్ చేస్తే..
- అయ్యో అయాన్.. చిన్నారిని అంగన్వాడీకి పంపిస్తే నిర్లక్ష్యంతో చంపేశారు..





