వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకున్నారు. బాబు కూడా జన్మించాడు. కొద్ది రోజులుగా భర్త ముఖం చాటేస్తున్నాడు. దీంతో తన నాలుగేళ్ల బాబుతో కలిసి భర్త ఇంటి ఎదుట భార్య ఆందోళన చేస్తోంది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
నల్గొండ జిల్లా చర్లపల్లికి చెందిన సౌందర్యకు మిర్యాలగూడ మండలం బంగారిగడ్డకు చెందిన సాయిదీప్కు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారి దీంతో ఇద్దరు ప్రేమించుకున్నారు. దళితురాలైన సౌందర్యతో వివాహం సాయిదీప్ కుటుంబ సభ్యులకు ఇష్టం లేదు. అయినా సాయిదీప్ పెళ్లి చేసుకుని మిర్యాలగూడలో బైక్ మెకానిక్‌గా జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. వీరికి నాలుగేళ్ల బాబు కూడా ఉన్నాడు. అయితే ఇటీవల సాయిదీప్ వేరే యువతితో ఫోన్లో తరచుగా మాట్లాడుతుండటాన్ని సౌందర్య గమనించింది. ఈ విషయమై ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. దీంతో కొద్దిరోజుల క్రితం సాయిదీప్ ఇంటి నుంచి వెళ్లిపోయాడు.
భర్త కోసం సౌందర్య ఎదురుచూసినా ఫలితం లేకపోయింది. తన భర్త కనిపించడం లేదంటూ మిర్యాలగూడ పోలీస్ స్టేషన్లో సౌందర్య ఫిర్యాదు చేసింది. అయినా ఆచూకీ లేదు. మిర్యాలగూడ పట్టణం బంగారుగడ్డలోని భర్త ఇంటికి కొడుకును తీసుకుని వెళ్ళింది. అయితే సాయిదీప్ కుటుంబ సభ్యులు సౌందర్యను ఇంట్లోకి అనుమతించలేదు. గేటుకు తాళం వేసి వెళ్లిపోయారు. దీంతో తనకు న్యాయం చేయాలంటూ నాలుగేళ్ల కొడుకుతో కలిసి భర్త ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. కొద్దిరోజులుగా తన భర్త కనిపించడం లేదని ఆరా తీస్తే తనను వదిలించుకునేందుకు.. భర్త, అతడి కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ప్రేమించి పెళ్లి చేసుకుని మోసం చేసిన భర్త నుంచి న్యాయం చేయాలని పోలీసులు కోరుతోంది. సౌందర్య ఆందోళనకు ప్రజాసంఘాలు కూడా మద్దతు పలికాయి.
Also Read
- సూర్య గోచారం.. 12 రాశులపై దీని ప్రభావం ఎలా ఉండనున్నదంటే?
- June Amavasya 2026: అమావాస్య నుంచి వీరికి మహర్దశ..! ఇందులో మీ రాశి ఉందా..?
- చెన్నూరు SBI గోల్డ్ చోరీ కేసు సుఖాంతం.. ఎట్టకేలకు బంగారం తిరిగి అందజేసిన బ్యాంక్
- రాత్రిళ్లు ఇళ్లను టార్గెట్ చేస్తున్న దొంగ బాబు.. బాలెనో కారులో వచ్చి చోరీలు!
- 9 ఏళ్ల తర్వాత సంచలన తీర్పు.. కంచర్ల శ్రీను హత్య కేసులో 13 మందికి జీవిత ఖైదు!





