SGSTV NEWS online
CrimeTelangana

Medak: ప్రేమ పెళ్లి.. పేరెంట్స్‌ను కౌన్సిలింగ్‌కు పిలిచిన పోలీసులు.. ఆపై ఊహించని సీన్..



మెదక్ జిల్లాలో పోలీసుల సమక్షంలోనే ప్రేమ జంటపై దాడి చేసి యువతిని కిడ్నాప్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మనోహరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో, యువతి బంధువులు జాతీయ రహదారిపై పోలీసు వాహనాన్ని అడ్డుకుని యువకుడిపై దాడి చేసి యువతిని బలవంతంగా తీసుకెళ్లారు.

మెదక్ జిల్లాలో ప్రేమ జంటపై దాడి చేసి యువతిని కిడ్నాప్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మనోహరాబాద్ పోలీస్‌ స్టేషన్ పరిధిలో బుధవారం సాయంత్రం పోలీసుల సమక్షంలోనే ఈ ఘటన జరగడం తీవ్ర కలకలం రేపింది.


కోనాయిపల్లి గ్రామానికి చెందిన సాయినాథ్ అనే యువకుడు, సిద్దిపేట జిల్లా ములుగు మండలం కొత్తూరు గ్రామానికి చెందిన యువతిని కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల గుడిలో ప్రేమ వివాహం చేసుకున్న వీరు మనోహరాబాద్ పోలీస్‌ స్టేషన్‌ను ఆశ్రయించారు. దీంతో పోలీసులు ఇరు కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ నిర్వహించారు.

అనంతరం జంటను సఖి కేంద్రానికి తరలిస్తుండగా, జాతీయ రహదారిపై యువతి బంధువులు పోలీసు వాహనాన్ని అడ్డుకున్నారు. పోలీసుల ముందే సాయినాథ్‌పై దాడి చేయడమే కాకుండా, యువతిని బలవంతంగా తీసుకెళ్లారు.

సాయినాథ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసి వెంటనే స్పందించారు. యువతిని గుర్తించి రక్షించి సఖి కేంద్రానికి తరలించారు. యువకుడిపై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని డీఎస్పీ నరేందర్ గౌడ్ తెలిపారు.

Also read

Related posts