హైదరాబాద్ హైటెక్ సిటీ కొండాపూర్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రాఘవేంద్ర కాలనీ పరిధిలోని వీ వీ హైట్స్‌లో సౌరభ్ శేఖర్ (36) అనే వ్యక్తి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకుని, అన్ని కోణాల్లోనూ దర్యాప్తు వేగవంతం చేశారు.
హైదరాబాద్: హైటెక్ సిటీ కొండాపూర్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రాఘవేంద్ర కాలనీ పరిధిలోని వీ వీ హైట్స్‌లో సౌరభ్ శేఖర్ (36) అనే వ్యక్తి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకుని, అన్ని కోణాల్లోనూ దర్యాప్తు వేగవంతం చేశారు. మృతుడు గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సౌరభ్ శేఖర్ అక్టోబర్ 10వ తేదీ సాయంత్రం తన స్నేహితుడిని కలిసేందుకు ఇంటి నుంచి బయలుదేరాడు. అదే రోజు రాత్రి సుమారు 7:30 గంటల సమయంలో తాను ఉన్న లొకేషన్‌ను కుటుంబ సభ్యుల వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేశాడు. అయితే మరుసటి రోజు ఉదయం నుంచి కుటుంబ సభ్యులు అతనికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ఆందోళన చెందిని సౌరభ్ శేఖర్ సోదరుడు కొండాపూర్‌లోని వీ వీ హైట్స్‌లో ఉన్న ఫ్లాట్ నంబర్ 402కు వెళ్లి చూడగా, అక్కడ సౌరభ్ విగతజీవుడిగా పడిఉండటాన్ని గుర్తించి షాక్‌కు గురయ్యారు.
ఈ ఘటనపై మృతుడి కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సౌరభ్ శేఖర్ గత పదేళ్లుగా భోజనం చేసిన ప్రతిసారీ తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతుండేవాడని వారు పోలీసులకు తెలిపారు. అయితే తన తమ్ముడి మృతిపై తమకు ఎలాంటి అనుమానాలు లేవని ఫిర్యాదుదారు పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి, సౌరభ్ అకస్మిక మృతికి గల అసలు కారణాలను నిర్ధారించేందుకు అన్ని కోణాల్లోనూ లోతైన దర్యాప్తు జరుపుతున్నారు.
Also read
- Hyderabad: కుటుంబసభ్యులకు లోకేష్ షేర్ చేసి ఫోన్ స్విచ్చాఫ్.. అనుమానంతో వెళ్లి చూస్తే షాక్!
- విశాఖలో క్షుద్రపూజల కలకలం.. ఫ్రిజ్ తెరిచి చూడగా స్థానికుల మైండ్ బ్లాక్.. అందులో ఏముందంటే..?
- రూటు మార్చిన స్మగ్లర్లు.. విశాఖ సిటీలో విదేశీ బంగారం భారీగా సీజ్, కోల్‌కతా టు హైదరాబాద్
- శరన్నవరాత్రి Day 2: గాయత్రీ దేవిగా దుర్గమ్మ! వేదమాత విశిష్టత, పూజా విధానం తెలుసుకోండి! ఇంద్రకీలాద్రి 2026
- శక్తి మాసంగా ఆశ్వయుజానికి పేరెలా వచ్చింది? శక్తి ఆరాధనకు ఈ నెల ఎందుకు అంత ప్రత్యేకమో తెలుసా?





