SGSTV NEWS online
CrimeTechnology

అయ్యో ఎంత పని చేశావమ్మా.. బిడ్డకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య.. పోలీసుల దర్యాప్తులో..



హైదరాబాద్‌లో తీవ్ర విషాదం వెలుగు చూసింది. తన 10 నెలల బిడ్డకి విషమిచ్చి ఓ తల్లి ఆత్మహ్యకు పాల్పడింది. మనవడు, కూతురి మరనవార్త విని తీవ్ర మనస్తాపానికి గురైన బాధితురాలి తల్లి సైతం ఆత్మహత్యకు ప్రయత్నించింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే హాస్పిటల్‌కు తరలించడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే భర్త వేధింపుల కారణంగానే భార్య ఆత్మహత్య చేసుకుందని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

భార్య భర్తల మధ్య గొడవలు వస్తే.. పిల్లలను చంపి తల్లిదండ్రులు చనిపోతున్న ఘటనలు రోజురోజుకూ పెరుగుతూ పోతున్నాయి. ఇటీవలే నారాయణపేట జిలాల్లో ఓ తండ్రి తన ఇద్దరి పిల్లలను హత్య చేసి తాను ఆత్మహత్యకు యత్నించిన ఘటన మరువక ముందే హైదరాబాద్‌లో మరో ఘటన వెలుగు చూసింది. భర్తతో గొడవల కారణంగా తన 10 నెలల చిన్నారికి విషమిచ్చి హత్య చేసిన తల్లి అనంతరం ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయం తెలిసిన బాధితురాలి తల్లి కూడా ఆత్మహత్యకు యత్నించింది.

వివరాల్లోకి వెళ్తే.. సరూర్‌నగర్ నివాసం ఉంటున్న యశ్వంత్‌ రెడ్డితో సుష్మిత పెళ్లి దంపతులకు రెండేళ్ల క్రితం పెళ్లి జిరిగింది. వీళ్లకు ప్రస్తుతం 10 నెలల బాబు కూడా ఉన్నాడు. అయితే కొద్దిరోజులుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నట్లు కుటంబసభ్యులు చెప్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం తన 10 నెలల కుమారుడికి కుమారుడికి విషం ఇచ్చిన తల్లి సుస్మిత.. కొడుకు చనిపోగానే తాను కూడా ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

కూతురు సుష్మిత, మనవడు చనిపోయారన్న మరణవార్త విన్న సుష్మిత తల్లి లలిత షాక్‌కు గురైంది. దీంతో ఆమెకూడా ఆత్మహత్యకు యత్నించింది. ఇంతలో ఆఫీస్‌ నుంచి ఇంటికొచ్చిన యశ్వంత్‌కు ఇంట్లో భార్య, కొడుకుతో పాటు అత్త అపస్మారక స్థితిలో కనిపించారు. దీంతో వాళ్లను వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లగా అప్పటికే భార్య, కుమారుడు మరణించినట్టు వైద్యులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకన్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అయితే బాధితురాలి మృతికి భర్త వేధింపులే కారణమని..  సుష్మితది ఆత్మహత్య కాదు.. హత్య అని, ఇంటి దగ్గర సీసీ ఫుటేజ్ బయటపెట్టాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు.

Also Read

Related posts