హైదరాబాద్ శివారు మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కేవలం ఒక చిన్న గొడవ చినికి చినికి గాలివానలా మారి, ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. అలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
చెంగిచెర్ల ఆర్టీసీ కాలనీకి చెందిన కొల్ల అరుణకు ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె కావ్య గతేడాది కరీంనగర్‌కు చెందిన కర్రు స్నేహిత్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. అయితే, పెళ్లయినప్పటి నుండి అల్లుడు స్నేహిత్ ప్రవర్తన సరిగ్గా లేదు. ఈ క్రమంలో, అత్త అరుణతో అతనికి తరచూ విభేదాలు తలెత్తాయి. దీంతో ఇద్దరు గొడవలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలోనే అరుణ, అల్లుడు స్నేహిత్ తో కలిసి బైక్‌పై వెళ్తున్నారు. ప్రయాణంలో ఉండగానే ఇద్దరి మధ్య పాత విషయాలపై వాగ్వాదం మొదలైంది. కోపంతో ఊగిపోయిన స్నేహిత్, బైక్ నడుపుతూనే తన తలకున్న హెల్మెట్‌ను తీసి అత్త తలపై బలంగా కొట్టాడు. ఈ దాడితో ఒక్కసారిగా అదుపుతప్పిన అరుణ, రన్నింగ్ బైక్ పైనుంచి రోడ్డుపై పడిపోయింది. తలకు బలమైన గాయం కావడంతో ఆమె స్పృహ కోల్పోయింది.
నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి స్నేహిత్ ఒక నాటకానికి తెరలేపాడు. అరుణకు ఫిట్స్ (మూర్ఛ వ్యాధి) వచ్చిందని, అందుకే బైక్ పైనుంచి పడిపోయిందని అందరినీ నమ్మించే ప్రయత్నం చేశాడు. ఆమెను ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ అరుణ మృతి చెందింది. అరుణ మృతిపై కుటుంబ సభ్యులకు అనుమానం రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా అసలు నిజం బయటపడింది. స్నేహిత్ హెల్మెట్‌తో దాడి చేయడం వల్లే ఆమె కింద పడిపోయినట్లు స్పష్టంగా రికార్డైంది. దీంతో పోలీసులు నిందితుడు స్నేహిత్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య తల్లిని ఇలా దారుణంగా చంపడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
Also read
- Vat Savitri Vrat 2026: అఖండమైన సౌభాగ్యం కోసం వట సావిత్రి వ్రతం.. ఈ ఏడాది ఖచ్చితమైన తేదీ, శుభ సమయం ప్రాముఖ్యత ఇదే!
- బాబోయ్..బట్టలు లేకుండా స్నానం చేస్తున్నారా..
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- ఎంత పనిచేశావ్ కిరణ్మయి.. లవర్ రీఛార్జ్ చేయలేదని ఏం చేసిందంటే..
- ఫిట్స్ అని డ్రామా.. కట్ చేస్తే సీసీటీవీతో వెలుగులోకి అసలు నిజం.. అదేంటంటే!





