SGSTV NEWS online
CrimeTelangana

Hyderabad: KBR పార్క్ వద్ద తచ్చాడుతూ అనుమానాస్పదంగా ముగ్గురు.. పోలీసులు వెళ్లి తనిఖీ చేయగా



KBR పార్క్ వద్దకు రోజూ ఉదయం, సాయంత్రం వందలాది మంది వాకింగ్ చేసేందుకు వస్తుంటారు. వారిలో వీఐపీలు కూడా ఉంటారు. ఆ ప్రాంతంలో ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా తచ్చాడుతూ కనిపించారు. వారి వాలకం తేడాగా ఉండటంతో.. పోలీసులకు సమాచారం అందింది …

రాష్ట్రాన్ని డ్రగ్ ప్రీ స్టేట్‌గా మార్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకు తగ్గట్లుగా డ్రగ్స్ వాడకం, రవాణాపై ఉక్కుపాదం మోపుతుంది. స్పెషల్ టాస్క్‌పోర్స్‌తో పాటు, ఎన్‌ఫోర్స్‌మెంట్, యాంటి డ్రగ్ సెల్ యూనిట్స్ స్పెషల్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నాయి. ఇన్ని చర్యలు తీసుకుంటున్నా.. పెడ్లర్లు ఇంకా బరితెగించి వ్యవహరించడం గమనార్హం. తాజాగా హైదరాబాద్ KBR పార్క్ దగ్గర గంజాయి, డ్రగ్స్‌ అమ్మకాలు కలకలం రేపాయి. దీనిపై పక్కా సమాచారంతో దాడి చేసిన ఎక్సైజ్‌ శాఖ అధికారులు.. గంజాయి, డ్రగ్స్‌ అమ్ముతున్న ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 2 గ్రాముల MDMA, రెండున్నర కిలోల గంజాయితో పాటు.. రెండు సెల్‌ఫోన్లు, రెండు స్కూటీలు, 5వేల 500 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి, డ్రగ్స్‌ అమ్ముతూ పట్టుబడ్డవారిని వేమేష్‌, దేవిచరణ్‌, హేమంత్‌గా గుర్తించారు.

KBR పార్క్ అంటే.. నగరం నడిబొడ్డు లెక్క. హై ప్రొఫైల్ ఉన్నవాళ్లు అక్కడ వాకింగ్ చేసేందుకు వస్తుంటారు. అలాంటి ప్లేసులో భయం లేకుండా డ్రగ్స్ అమ్మేందుకు యత్నించడం తీవ్ర కలకలం రేపుతోంది. అది వాళ్ల స్పాటా..? లేదా ఎవరికైనా డ్రగ్స్ ఇచ్చేందుకు అక్కడికి వచ్చారా..? వారి డ్రగ్ లింక్స్ ఎక్కడివి అనే అంశాలపై ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. డ్రగ్స్ విషయంలో.. ఉపేక్షించే పరిస్థితులు ఉండవని.. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. డ్రగ్స్ గురించి ఏదైనా సమాచారం తెలిస్తే తమకు ఇవ్వాలని.. ఇన్ఫర్మేషన్ ఇచ్చినవారి వివరాలు గోప్యంగా ఉంచుతామంటున్నారు

Also Read

Related posts