హైదరాబాద్, మే 15: హైదరాబాద్ మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చార్టెడ్ అకౌంటెన్సీ (సీఏ) చదువుతున్న విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. మియాపూర్‌లోని గోకుల్ ప్లాట్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. కర్నూలు జిల్లాకు చెందిన జనార్దన్ హైదరాబాద్‌లో ఉంటూ సీఏ చదువుతున్నాడు. అయితే జనార్దన్ తన గదిలో ఉరివేసుకుని కనిపించడంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న మియాపూర్ పోలీసులు గదిని పరిశీలించగా కొన్ని రక్తపు మరకలు కనిపించినట్లు తెలుస్తోంది. దీంతో జనార్దన్ మృతిపై కుటుంబ సభ్యులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
తమ కుమారుడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, గదిలో రక్తపు ఆనవాళ్లు ఉండటం చూస్తుంటే ఈ ఘటన వెనుక ఏదో కుట్ర ఉండొచ్చని తల్లిదండ్రులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన మియాపూర్ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీం సాయంతో గదిలోని ఆధారాలను సేకరిస్తున్నారు. అలాగే మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. జనార్దన్ మృతి ఆత్మహత్యా? లేక మరేదైనా అనుమానాస్పద పరిస్థితుల ఫలితమా? అన్న దానిపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. పోస్టుమార్టం నివేదిక, ఫోరెన్సిక్ ఆధారాల ఆధారంగా పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
Also read
- నేటి జాతకములు 26 సెప్టెంబర్, 2026
- అన్నను స్కూల్ బస్సు ఎక్కించేందుకు తల్లి వెంటే వచ్చి.. అదే బస్సు కిందపడి మూడేళ్ల బాలుడు మృతి!
- వేడి సాంబార్లో పడి మహిళ మృతి.. సీసీ కెమెరాలో షాకింగ్ దృశ్యాలు!
- విష్ణుమూర్తి నాభి నుంచే పద్మం ఎందుకు పుట్టింది? బ్రహ్మదేవుడి ఆవిర్భావం వెనుక అసలు రహస్యం ఇదే!
- దుర్ముహూర్తం అంటే ఏమిటి? ఈ సమయంలో శుభకార్యాలు ఎందుకు చేయరు? కారణం ఇదే!





