SGSTV NEWS online
CrimeTelangana

బాన్సువాడలో నాటు బాంబుల పేలుడు.. నలుగురు చిన్నారులతో సహా ఆరుగురికి తీవ్రగాయాలు..!



కామారెడ్డి జిల్లా: బాన్సువాడ పట్టణంలోని వడ్డెర బస్తీలో నాటు బాంబులు పేలిన ఘటన తీవ్ర కలకలం రేపింది. బైక్‌పై నాటు బాంబులను తీసుకెళ్తుండగా ప్రమాదవశాత్తూ పేలుడు సంభవించినట్లు సమాచారం. ఈ ఘటనలో ఆరుగురు తీవ్రంగా గాయపడగా, వారిలో నలుగురు చిన్నారులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది.


పేలుడు ధాటికి గాయపడిన వారంతా ఒక్కసారిగా కేకలు వేయడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న స్థానికులు క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. చిన్నారులు కూడా గాయపడటంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. నాటు బాంబులను బైక్‌పై ఎందుకు తీసుకెళ్తున్నారు? వాటిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? పేలుడుకు అసలు కారణం ఏమిటి? అనే కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పేలుడుకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. బాన్సువాడ వడ్డెర బస్తీలో చోటుచేసుకున్న ఈ పేలుడు స్థానికంగా తీవ్ర భయాందోళనకు గురిచేసింది. పోలీసుల దర్యాప్తులో మరిన్ని వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది

Also read

Related posts