SGSTV NEWS online
Andhra PradeshAP Local Body Elections

పోలింగ్ ప్రక్రియలో వైకాపా కుట్రలను సమర్థవంతంగా తిప్పి కొట్టిన క్విక్ రియాక్షన్ టీమ్ బృందం

గుంటూరు తూర్పు ,పశ్చిమ ప్రత్తిపాడు.

*పోలింగ్ ప్రక్రియలో వైకాపా కుట్రలను సమర్థవంతంగా తిప్పి కొట్టిన క్విక్ రియాక్షన్ టీమ్ బృందం*

గుంటూరు నగర పాలక సంస్థ ఎన్నికల సందర్భముగా కూటమి ప్రభుత్వ అభ్యర్థులకు పోలింగ్ జరిగే సమయంలో పలు వార్డుల్లో ఆటంకాలు కల్పించటానికి వైకాపా సిద్ధమైన నేపథ్యంలో జిల్లా తెలుగుయువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ నేతృత్వంలో క్విక్ రియాక్షన్ టీం ఏర్పాటు చేసి పలు వార్డుల నుండి వచ్చిన అత్యవసర ఫోన్ కాల్స్ కు స్పందిస్తూ గుంటూరు నగరం అంత జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు , బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షులు సిరిపురపు శ్రీధర్ తథితరులతో కలిసి జరిగిన అవాంఛనీయ సంఘటనలను సమర్థవంతంగా ఎదుర్కొని అండగా నిలిచారు.

ఈ క్విక్ రియాక్షన్ టీం ఎన్నికల సంఘం అధికారులకు పోలీస్ అధికారులకు ఫిర్యాదులకు చేసిన వెంటనే స్పందించి ప్రజాస్వామ్యాన్ని కాపాడిన అధికారులకు మరియు పోలీస్ ఉన్నతాధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు.

తొలుత క్విక్ రియాక్షన్ బృందం వారి పోలింగ్ బూత్ లలో తమ ఓటు హక్కును వినియోగించుకొని గోరంట్ల, స్వర్ణభారతి నగర్, జేకేసీ కళాశాల, సాయి ఆదిత్య స్కూల్, స్టాల్ గర్ల్స్ స్కూల్,ఎటి అగ్రహారం,ఎస్ కే బి ఎం స్కూల్,ఎన్ జి ఓ కాలనీ 37,38 బూత్ లు, పట్టాభిపురం హై స్కూల్,పుల్లయ్య స్కూల్,గుంటూరు తూర్పు లో వెంగళరావు నగర్, రెడ్డి పాలెం,గోరంట్ల, హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ బూత్లు, మాజేటి గురవయ్య స్కూల్, చుట్టుగుంట, నల్లపాడు, మున్నంగి స్కూల్,వెంకటేశ్వర బాలకుటీర్, గుజ్జనగుండ్ల మున్సిపల్ స్కూల్, చిన్మయ స్కూల్, గార్డెన్స్ దివ్యంగుల హాస్టల్, పాటిబండ్ల సీతారామయ్య హై స్కూల్ , నగరాలు నవీన స్కూల్, లిటిల్ ఫ్లవర్ స్కూల్ ప్రాంతాలలో విస్ప్రుతంగా పర్యటించారు.  శ్యామలానగర్ బాలకుటీర్, గుజ్జనగుండ్ల మున్సిపల్ స్కూల్, ఎన్జీవోస్ కాలనీ బూత్ ల వద్ద తీవ్ర ఘర్షణలు జరగగా పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా సత్వరం పరిష్కరించి పరిస్థితులను అదుపుచేశారు. ఘర్షణలు ఎదుర్కున్న బృందంలో రాజశేఖర్, శేషాద్రి సాంబశివరావు, బుల్లా కుమార్ బాబు, మంత్రివాడి అభినయ్, యస్వంత్, శ్రీను ,నవీన్,అజయ్, శివ తథితరులు పెద్దసంఖ్యలో పాల్గున్నారు.

Also read

Related posts